మండుటెండలోనే ప్రయాణికులు
ABN, Publish Date - May 11 , 2025 | 11:43 PM
స్థానిక బస్టాండ్‌లో మండు టెండలోనే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు
దేవనకొండ బస్టాండులో ఎండలో ప్రయాణికుల అవస్థలు
మౌలిక వసతులు కల్పించని ఆర్టీసీ అధికారులు
దేవనకొండ, మే 11(ఆంధ్రజ్యోతి): స్థానిక బస్టాండ్‌లో మండు టెండలోనే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్టాండులో ఆర్టీసీ అధికారులు మౌళిక వసతులు కల్పించలేదు. వేసవి ఎండలకు అల్లాడి పోతున్నారు. నిర్వహణ లేకపోవడంతో మరుగుదొడ్లు దుర్వాసన వెదజ ల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి, వసతులు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Updated Date - May 11 , 2025 | 11:43 PM