ప్రయాణికుల అవస్థలు
ABN, Publish Date - Apr 27 , 2025 | 11:32 PM
పట్టణంలోని ఆలూరు రోడ్డు వదంద తిమ్మారెడ్డి బస్టాండు వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
షెడ్డును ఆక్రమించిన వ్యాపారులు
రోడ్డుపైనే ప్రయాణికులు
తిమ్మారెడ్డి బస్టాండు దుస్థితి
ఆదోని టౌన్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆలూరు రోడ్డు వదంద తిమ్మారెడ్డి బస్టాండు వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షం కురిస్తే చాలు బస్టాండు ఆవరణ అంతా బురదమయంగా మారుతోంది. షెడ్డును వీధి వ్యాపారులు ఆక్రమించడంతో రోడ్డుబయటే ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు.
తాత్కాలికంగా ఏర్పాటు
శ్రీనివాస భవన్ హోటల్ ఎదురుగా ఉన్న స్థలంలో గతంలో పాత బస్టాండ్ ఉండేది. అయితే ఆస్పరి రోడ్డులో కొత్త బస్టాండ్ నిర్మించడంతో పట్టాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అధికారులు పాత బస్ స్టాండ్‌ను తొలగిం,ఆనేజ అయితే గుంతకల్, ఆలూరు, పుణ్య క్షేత్రాలైన ఉరుకుంద, మంతాలయం, ఎల్లార్తి కర్ణాటక ప్రాంతాలైన బళ్ళారి, సిరిగుప్ప సింధనూర్, బెంగుళూరు హుబ్లీ ప్రాంతాల ప్రయాణికుల సౌకర్యార్థం నాటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తాత్కాలికంగా తిమ్మారెడ్డి బస్ స్టాండ్‌ను, ఏర్పాటు చేశారు.
మా పరిధిలో లేదు
తిమ్మారెడ్డి బస్టాండు ప్రైవేటు స్థలంలో ఉంది. మా పరిధిలో లేదు. ప్రయాణికుల సౌకర్యార్థం ఒక కంట్రోల ర్‌ను ఏర్పాటు చేశాం. అభివృద్ధి చేసేం దుకు అనుమతి లేదు. - రఫిక్, ఆర్టీసీ, డీఎం
Updated Date - Apr 27 , 2025 | 11:32 PM