ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యోగాంధ్రలో భాగస్వాములు కావాలి: జేసీ

ABN, Publish Date - May 24 , 2025 | 01:18 AM

యోగాంధ్రలో ప్రజ లంతా భాగస్వాములు కావాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య అన్నారు.

ర్యాలీలో పాల్గొన్న జాయింట్‌ కలెక్టర్‌ నవ్య, అధికారులు

కర్నూలు కలెక్టరేట్‌, మే 23(ఆంధ్రజ్యోతి): యోగాంధ్రలో ప్రజ లంతా భాగస్వాములు కావాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య అన్నారు. శుక్రవారం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ నుంచి రాజ్‌విహార్‌ సెంటర్‌ వరకు నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని జాయింట్‌ కలెక్టర్‌ నవ్య ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించే అంత ర్జాతీయ యోగా దినోత్సవం జూన 21న ప్రజలందరూ పాల్గొన్నాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇంకా ఒక నెల ఉందని, ఈ నెల రోజులు యోగా గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. జూన 21న విశాఖపట్నంలో మెగా ఈవెంట్‌ జరుగుతుం దని, దీనికి కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనాలనే లక్ష్యంతో ఈ క్యాంపె యినను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో వినియో గదారుల కమిషన అధ్యక్షుడు కరణం కిషోర్‌ కుమార్‌, డీఎస్‌వో రాజా రఘువీర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు, డీఎస్‌డీవో భూపతి రావు, డీఏవో డా.శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 01:18 AM