ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలి

ABN, Publish Date - Apr 26 , 2025 | 11:30 PM

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలని టీడీపీ నాయకులు భూపాల్‌ చౌది, రామస్వామి, రంగస్వామి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకట చౌదరి, మారుతి నాయుడు, అప్సర్‌ బాషా డిమాండ్‌ చేశారు.

ఆదోనిలో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

ఆదోని, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలని టీడీపీ నాయకులు భూపాల్‌ చౌది, రామస్వామి, రంగస్వామి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకట చౌదరి, మారుతి నాయుడు, అప్సర్‌ బాషా డిమాండ్‌ చేశారు. శనివారం రాత్రి పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదం దేశాన్ని పట్టి పీడిస్తోందని, పాకిస్తాన్‌ కయ్యానికి కాలు దువ్వుతూ ఉగ్రవాదచర్యలు ప్రేరేపిస్తోందనీ, ఫలితంగా మనం చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదా నికి ముగింపు పలకాలని అన్నారు. ఉగ్రవాదులంతా ఒకటిగా మారుతున్నారని తెలుస్తోందని, అదే జరిగితే ప్రపంచ దేశాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పీవోకేను స్వాధీనం చేసుకుంటే ఉగ్రవాదం అణగిపోతుందన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:30 PM