‘పీ-4’తో పేదల బతుకుల్లో వెలుగులు
ABN, Publish Date - Jul 28 , 2025 | 10:48 PM
పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ప్రవేశపెట్టిన కార్యక్రమమే ‘పీ-4’ అని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలి
లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలి
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ప్రవేశపెట్టిన కార్యక్రమమే ‘పీ-4’ అని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం కలెక్టర్ పలు ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. జిల్లాలో 42,937 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉండగా 41,613 కుటుంబాలను మాత్రమే దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ఇంకా 1324 కుటుంబాలను దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు మరింత కృషిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలని కోరారు. జిల్లాలో ప్రతిశాఖలో మంచి ప్రాజెక్టులు ఉంటాయని, వాటిని ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్‌లో అప్‌లోడ్ చేసి జిల్లాకు ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయాలన్నారు. కుందూ నదికి నీటిని విడుదల చేశారని, నది సమీపంలో ఉన్న 72గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కటి విద్యను అందించాలన్నారు.
Updated Date - Jul 28 , 2025 | 10:48 PM