ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యాజమాన్య పద్ధతులు పాటించాలి: శాస్త్రవేత్త

ABN, Publish Date - Apr 20 , 2025 | 12:52 AM

పత్తి పంటలో సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ నంద్యాల శాస్త్రవేత్త డాక్టర్‌ శివరామకృష్ణ అన్నారు.

మాట్లాడుతున్న శాస్త్రవేత్త శివరామకృష్ణ

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): పత్తి పంటలో సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ నంద్యాల శాస్త్రవేత్త డాక్టర్‌ శివరామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని హుశేనాపురం గ్రామంలో గులాబి రంగు పురుగు యజ మాన్యంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్ర మానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ నంద్యాల శాస్త్రవేత్త డాక్టర్‌ శివరామకృష్ణ, అశోక్‌ కుమార్‌, సీజనల్‌ శాస్త్రవేత్త పుల్లీబాయి, మండల వ్యవసాయాధికారి సుధాకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్‌ శివరామకృష్ణ మాట్లాడుతూ వేసవిలో పత్తి పంట వేయడం శ్రేయస్కరం కాదని రైతులకు సూచించారు. దీనివల్ల గులాబి రంగు ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంద న్నారు. పత్తిలో అధిక సాంద్రతలో పత్తి సాగు చేయడం, సూచనలు, సాంకేతికతను డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ రైతులకు వివరించారు. పత్తిలో సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్‌ పుల్లీబాయి తెలియజేశారు. కార్యక్రమంలో రైతులు కాటినేని నారాయణ, జీకే సుధాకర్‌, రైతు సేవా సిబ్బంది గంగాధర్‌, భువనేశ్వరి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 12:52 AM