ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇనాంగా వారసత్వ భూములు

ABN, Publish Date - Jul 16 , 2025 | 12:32 AM

గత ప్రభుత్వం చేసిన రీసర్వేతో రైతులు అవస్థలు పడుతున్నారు. వారసత్వ భూములను ఆన్‌లైన్‌లో ఈనాం భూములుగా చూపుతుండటంతో రైతులు అవస్థలు పడుతున్నారు.

రెవెన్యూ అధికారికి వినతి పత్రం ఇస్తున్న రైతులు(ఫైల్‌)

అన్నదాత సుఖీభవ, ఇతర పథకాలకు దూరం

ఆలూరు మండలంలో రైతుల అవస్థలు

ఆలూరు, జూలై15(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం చేసిన రీసర్వేతో రైతులు అవస్థలు పడుతున్నారు. వారసత్వ భూములను ఆన్‌లైన్‌లో ఈనాం భూములుగా చూపుతుండటంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఆలూరు మండలంలో తుంబలబీడు, కమ్మరచేడు, ముద్దనగేరి, కురువళ్లి, కరిడిగుడ్డం, మరకట్టు గ్రామాల్లో దాదాపు 700 మందికి పైగా రైతులకు రుణాలు మంజూరు కావడం లేదు.

అందని ప్రభుత్వ పథకాలు

రుణాలు రీ షెడ్యూల్‌ కావు. కొత్త రుణాలు అందవు. బీమా చేసే అవకాశం లేకపోవడంతో పంట నష్ట పరిహారం అందదు. అన్నదాత సుఖీభవకు దూరం. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పరికాలు అందవు. ఈ భూములను విక్రయించే అవకాశం లేదు.

అన్నదాత సుఖీభవకు దూరం

ఆన్‌లైన్‌లో వారసత్వ భూములు సైతం ఇనాం భూములుగా చూపుతుండటంతో ‘అన్నదాత సుఖీభవ’ పథకం అందడం లేదు. తమ భూములను వారతస్వ భూములుగా మార్చాలని రైతులు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

జేసీ దృష్టికి తీసుకెళ్లాం

రీ సర్వే చేసిన గ్రామాల్లో తమ వారసత్వ భూములు ఇనాం భూము లుగా అడంగల్‌లో చూపుతున్నట్లు రైతులు ఫిర్యాదు చేశారు. సమస్యను జేసీ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం. రైతులు ఆందోళన చెందా ల్సిన అవసరం లేదు. - విజయ్‌కుమార్‌, డీటీ, ఆలూరు.

Updated Date - Jul 16 , 2025 | 12:32 AM