ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఓ వైపు స్వచ్ఛాంధ్ర, మరోవైపు మురుగు

ABN, Publish Date - May 17 , 2025 | 11:45 PM

ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తహసీల్దార్‌ హుశేన్‌ సాహెబ్‌, డిప్యూటీ ఎంపీడీవో శివకుమార్‌, సర్పంచ్‌ బండారు సుహాసిని సూచించారు.

మద్దికెరలో ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు... ఎం.అగ్రహారంలో రోడ్డుపై మురుగు

పరిసరాల పరిశుభ్రతపై మద్దికెరలో అధికారుల ర్యాలీ,. ఎం.అగ్రహారంలో రోడ్డుపై డ్రైనేజీ

మద్దికెర, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తహసీల్దార్‌ హుశేన్‌ సాహెబ్‌, డిప్యూటీ ఎంపీడీవో శివకుమార్‌, సర్పంచ్‌ బండారు సుహాసిని సూచించారు. శనివారం ఎస్సీ కాలనీలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా అవగాహన కల్పించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయవద్దని తడి, పొడి చెత్తను వేరు చేసి కార్మికులకు అందించాలన్నారు. వీఆర్వో రంగస్వామి, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పారా రాఘవేంద్ర, తదితరులు ఉన్నారు.

ఎం.అగ్రహారంలో రోడ్డుపైనే మురుగు

మద్దికెర మండలం ఎం.అగ్రహారం గ్రామం ఎస్సీ కాలనీలో మురుగు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. మురుగు ఇలా రోజుల తరబడి నిల్వ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ వైపు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే అధికారులు పారిశుధ్య పనులు చేయించడం మరిచారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 17 , 2025 | 11:45 PM