ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అయ్యో... ఆర్‌యూ

ABN, Publish Date - May 03 , 2025 | 12:35 AM

అయ్యో... ఆర్‌యూ

విశ్వవిద్యాలయ లైబ్రరీలో పుస్తకాలకు చెదలు

19 విభాగాల్లో వైఫై టెక్నాలజీ నిరుపయోగం

రూ. కోట్లతో నిర్మించిన భవనాలు శిఽథిలావస్థకు..

ఎంఈడీలో నిరుపయోగంగా ఉన్న రూ. కోట్ల పరికరాలు

గెస్టు హౌస్‌ ఉన్నా ప్రైవేట్‌ లాడ్జీలకు ఏటా రూ. 5 లక్షలు

ఐడీ కార్డు లేకుండానే విద్యార్థుల చదువులు

విశ్వవిద్యాలయాలు భావ సంఘర్షణ కేంద్రాలుగా వికసించాలి. నిరంతర నూతన అధ్యయనాలకు నెలవు కావాలి. ప్రజలు గర్వించదగ్గ మేధావులుగా ఆచార్యులు విద్యార్థులను ప్రభావితం చేయాలి. దేశ మేధో అవసరాలు తీర్చే సృజనాత్మక పరిశోధనలు జరుగుతూ ఉండాలి. విషాదకరంగా ఇవేవీ రాయలసీమ విశ్వవిద్యాలయంలో లేవు. అక్కడ గ్రంథాలయంలోని పుస్తకాలు చెదపట్టిపోతున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించిన పరికరాలు, సాంకేతిక ఏర్పాట్లు నిరుపయోగంగా తయారయ్యాయి. చివరికి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ల నిర్వాకానికి, అధికారుల నిర్లక్ష్యానికి ఇది చాలు. నిత్యం అంతర్గత వివాదాలతో ఆర్‌యూ కునారిల్లిపోతున్నదని, బోధన, అధ్యయనం, పరిశోధన ఊసే లేదనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉపకులపతులు ఏసీ గదులకే పరిమితం కావడం, అధ్యాపకులు చదువులు చెప్పక పోవడం, అసలు విశ్వవిద్యాలయం సమాజంలో భాగమనే స్పృహ లేకపోవడం వంటి జాడ్యాలతో నిరాశాపూరిత వాతావరణం నెలకొని ఉంది. ఆర్‌యూ ఎన్నటికైనా సరైన దారిలోకి వస్తుందా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కర్నూలు అర్బన్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ విశ్వవిద్యాలయ పాలన పూర్తిగా గాడి తప్పింది. గతంలో వర్శిటీ ఖజాన నుంచి దాదాపు రూ. 20 కోట్లతో భవనాలు, పరికరాలు, గెస్టు హౌస్‌ లాంటి సౌకర్యాలను కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లోని సెంట్రల్‌ వర్శిటీ స్థాయిలో సౌకర్యాలు సమకూర్చాలనే లక్ష్యంతో నిధుల కేటాయించారు. నిర్మాణాలు చేపట్టారు. ఆధునిక టెక్నాలజీ సౌకర్యాలు సమకూర్చారు. అయితే వాటిని సద్వినియోగం చేసుకునేందుకు సరైన అధికారులు, సూచనలు చేసే నాయకత్వం లేదు. ప్రొఫెసర్లు తమ ఆధిపత్యం కోసం విద్యార్థులను వర్గాలుగా చీల్చి ఓ సామాజిక వర్గం పేరు చెప్పుకుని వారి అండతో భూము లను కాజేసి, విలువైన ఆస్తులను నిర్వీర్యం చేస్తూ అభివృద్ధికి ఆటంకంగా మారారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు చదువు చెప్పడంలో ప్రొఫెసర్లు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభు త్వం నియమించిన కొత్త ఉపకులపతి అయినా వీటిపై దృష్టి సారించి నిరుపయోగంగా ఉన్న భవనాలను వినియోగంలోకి తీసుకరావాలని, ఉచిత వైఫై అందుబాటులోకి తీసుకు రావాలని విద్యార్థులు కోరుతున్నారు.

2008 వర్శిటీలో రూ. 8 కోట్లతో సెంట్రల్‌ యూనివర్సిటీ తరహాలో వర్శిటీలో అండర్‌ గ్రౌండ్‌ టెక్నాలజీతో యూనివర్సిటీలో 19 విభాగాలతో ఉచితంగా విద్యార్థులకు అందించేందుకు వైఫై టెక్నాలజీని తీసుకువచ్చారు. కానీ ముచ్చటగా 6 నెలలు మాత్రమే విద్యార్థులకు ఉపయోగపడింది. ఆ తర్వాత నిరుపయోగంగా మారింది. ఆదే విధంగా వర్శిటీలో ఎంబీఏ విభాగం ఏర్పాటు అయ్యాక వాటికి ప్రత్యేకమైన లైబ్రరీ ఏర్పాటు చేసి రూ. 25 లక్షలతో పుస్తకాలు కొన్నారు. కానీ వాటికి నేటికి అడిట్‌ లేదు... అధికారి లేడు. వినియోగం లేక పుస్తకాలకు చెదపడుతున్నాయని విద్యార్థులు అంటున్నారు.

ఎడ్యుకేషన్‌ విభాగం కోర్సు ప్రారంభంలో కోర్సు ఉపయోగం కోసం విద్యార్థులకు నూతన టెక్నాలజీ కోసం కోట్ల రూపాయలు కేటాయించి పరిక రాలు కొన్నారు. ప్రస్తుతం కోర్సు రద్దు కావడంతో పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. వర్శిటీలో పాత లైబ్రరీ, 3వ బిల్డింగ్‌తోపాటు బాలుర వసతి గృహంలో తుంగభద్ర, కృష్ణ బిల్డింగ్‌, మెస్‌ హాలు, క్యాంటిన్‌, బిల్డింగ్‌లు ఖాళీగా ఉండటంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

మరుగున పడ్డ గెస్టు హౌస్‌.. ప్రైవేట్‌ లాడ్జీల కోసం ఏటా. 5 లక్షలు

రాయలసీమ యూనివర్సిటీ లో గెస్టు హౌస్‌ కోసం గతంలో రూ. 2 కోట్ల వర్శిటీ నిధులతో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఆలనా పాలన లేక శిఽఽథిలావస్థకు చేరుకుంటోంది. ఉన్న వాటిని ఉపయోగించుకోకుండా వచ్చిన అతిఽథుల కోసం ప్రైవేట్‌ లాడ్జిలపై ఆధార పడుతున్నారు. దీని వల్ల ప్రతి ఏటా లాడ్జీలకు వర్శిటీ నిధుల నుంచి దాదాపు రూ. 5 లక్షల వరకు తగలేస్తున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు.

విద్యార్థులకు ఐడీ కార్డులు లేవు

వర్శిటీలో చదివే విద్యార్థులకు జాయిన్‌ అయ్యాక ప్రారంభంలోనే ఐడీ కార్డు వర్శిటీ అధికారులు ఇస్తారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఐడీ కార్డు ఇవ్వడం లేదు. ఇటీవల కొత్త ఉపకులపతి వద్ద విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు తమకు ఐడీ కార్డులు మంజూరు చేయాలని వేడుకున్నారు.

కొత్త అకడమిక్‌లో ప్లాన్‌ చేస్తా

వర్శిటీ క్యాంపస్‌లో నిరుప యోంగా చాలా బిల్డింగ్‌లు ఉన్నట్టు కొంత మంది విద్యా ర్థులు తెలిపారు. వేసవి సెలవు ల్లో పరిశీలించి కొత్త అకడమిక్‌ ఇయర్‌లో తగిన ప్లాన్‌ చేస్తాం. ఇంజనీ రింగ్‌ కళాశాలకు కొత్త ల్యాబ్స్‌ మంజూరు అయ్యాయి. విద్యా ర్థుల అవసరాల కోసం నిరుప యోగంగా ఉన్న భవనాలను వినియోగం చేసే దిశగా ప్రయత్నిస్తాం.

- వి. వెంకట బసవరావు, ఉపకులపతి, రాయలసీమ యూనివర్సిటీ

Updated Date - May 03 , 2025 | 12:35 AM