అధికారులు సమన్వయంతో పని చేయాలి
ABN, Publish Date - May 11 , 2025 | 12:17 AM
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్నివిభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ డా.బి.నవ్య అధికారులను ఆదేశించారు.
నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలి
సోషల్‌మీడియాలో అనవసర ట్రోల్స్ చేయకండి
ఇన్‌చార్జి కలెక్టర్ బి.నవ్య
కర్నూలు కలెక్టరేట్, మే 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్నివిభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ డా.బి.నవ్య అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉండడంతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, హోంగార్డ్స్, పోలీసు, రెవెన్యూ, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, సివిల్ డిఫెన్స్ సిబ్బంది, హాస్పిటల్స్ తదితర విభాగాలు అన్ని సమన్వయంతో 24/7 పనిచేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైన వస్తువులు, రేషన్, మందులు, నూనె (ఇంధనం) తదితర నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రజలను సురక్షిత ప్రదేశాలను తరలించడానికి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. సోషల్ మీడియాలో అనవసరమైన పుకార్లు, ట్రోల్స్‌ను వ్యాపింపచేయకూడదని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉంటే పోలీసు, రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకురా వాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Updated Date - May 11 , 2025 | 12:17 AM