తనిఖేల్
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:33 AM
అధికారులు తనిఖీలకు వస్తున్నారంటే వారితో ఓ ఆట ఆడుకున్నారు.. బోర్డులు మార్చి బురిడీ కొట్టించారు.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లుగా మా యాజాలం ప్రదర్శించారు..
బోర్డులు మార్చి అధికారులతో ఆటలు
సౌకర్యాలు శూన్యం.. ధరల పట్టికలకే ప్రాధాన్యం
కాసుల కోసం కక్కుర్తి
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ఆదోనిలో నర్సింగ్, పారా మెడికల్ కళాశాలల తతాంగం
ఆదోని అగ్రికల్చర్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): అధికారులు తనిఖీలకు వస్తున్నారంటే వారితో ఓ ఆట ఆడుకున్నారు.. బోర్డులు మార్చి బురిడీ కొట్టించారు.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లుగా మా యాజాలం ప్రదర్శించారు.. ఎట్టకేలకు వారితో బురి‘డీల్’ కుదుర్చుకొని పని కానించారు. భవిష్యత్తులో అక్కడ చదివిన విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే ఎక్కడ నుంచి సర్టిఫికెట్లు ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంత జరుగుతున్న సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు ఈవిషయంపై చర్యలు తీసుకోక పోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. పిల్లల భవిష్యత్తుతో చెలగాట మాడుతున్న నర్సింగ్, పారా మెడికల్ కళాశాలల తతాంగంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం..
మూడేళ్లుగా...
ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల రహదారిలో టీవీఎస్ షోరూం ఎదురుగా ఆర్‌ఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఆర్‌ఎస్ పారా మెడికల్ కళాశాల మూడేళ్లుగా ఇంటిని అద్దెకి తీసుకొని నడుపుతున్నారు. జనరల్ నర్సింగ్ మిడ్‌పెఫైరీ మూడేళ్ల కోర్సు (జీఎన్‌ఎం), డిప్లమా మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ (డీఎంఎల్‌టీ) డిప్లొమా మల్టీ పర్సస్ హెల్త్ అసిస్టెంట్ (డీఎంపీ హెచ్‌ఏ) వీటితోపాటు మరిన్ని కోర్సులు
ఏర్పాటు చేశారు. ఈ కళాశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమ తులు లేవు. కళాశాల నుమతుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడంతో విజయవాడ వైద్య ఆరోగ్య శాఖ డీఎంఈ కార్యాలయం నుంచి
తనిఖీల కోసం బుధవారం ఓ బృందం వచ్చింది. తనిఖీల కోసం వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులకే బురిడీ కొట్టించిన విషయం అందరికీ తెలిసిందే. విశ్వ నారాయణ ఒకేషనల్ జూనియర్ కళాశాలను ఇదే ఆర్‌ఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల అని చూపించే ప్రయత్నించారు. విశ్వ నారాయణ ఒకేషనల్ జూనియర్ కళాశాల పేరు కనిపించకుండా స్టిక్కర్టు అతికించి బోర్డును ఏర్పాటు చేశారు. తనిఖీకొచ్చిన అధికారులు సైతం అలాచూసి ఇదే నా కాలేజ్ అంటూ వెళ్లిపోయినట్లు తెలిసింది.
మరో నర్సింగ్ స్కూల్ కూడా..
పట్టణంలోని విక్టోరియా పేటలో నేషనల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉంది. ఈ నర్సింగ్ విద్యా సంస్థ కూడా ఐదేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండానే యఽథేచ్ఛగా జీఎన్‌ఎమ్ కోర్సులు నిర్వహి స్తున్నారు. ఈ కళాశాల కరస్పాండెంట్ కర్నూలు ఓ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన తన పలుకుబడితో ఒక్క కళాశాలను అనుమ తులు లేకుండానే కొనసాగిస్తున్నారు. విద్యార్థి సంఘాలు రెండేళ్లుగా పోరాడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు.
అధికారులు నిఘా ఉంచాలి
ఓ అద్దె ఇంట్లో విద్యార్థులకు ఎలా బోధిస్తారు. తరగతులు ఎలా నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులను అడ్మిషన్లు చేసుకొని వేలకు వేలు ఫీజులు వసూలు చేసి ప్రయోగాలకు ల్యాబ్, అనుబంధ ఆసుపత్రి లేకుండానే కొనసాగి స్తామన్నారు. ఇలాంటి విద్యాసంస్థలపై అధికారులు నిఘా ఉంచి విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాపాడాలని పలువురు కోరుతున్నారు. ఆర్‌ఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలకు చెందిన కరస్పాండెంట్‌కు ఈవిషయంపై ఫోన్ చేయగా రెండు రోజులుగా స్పందించడం లేదు
కోర్సును బట్టి రూ.35వేల నుంచి..
ఆర్‌ఎస్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఆర్‌ఎస్ ఆర్‌ఎస్‌పారా మెడికల్ కళాశాల ఆదోని అని విద్యార్థులను డీఎంఎల్‌టీ, డీఎంహెఎచ్‌ఏ కోర్సులకు అడ్మిషన్లు చేసు కుంటున్నారు. అసలు ఈ కళాశాలకు కూడా అనుమతులు లేవు. యథేచ్ఛగా వారు ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలో కోర్సుకు సంబంధించిన ఫీజులు బోర్డును ఏర్పాటు చేశారు. కోర్సును బట్టి రూ.35వేల నుంచి రూ.50వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్న ట్లు తెలుస్తోంది. లైబ్రరీ ఫీజు రూ.2వేలు, యూనిఫామ్ రూ.4వేలు, లేబరేటరీ రూ.4500, క్లినికల్ ఫీజు రూ.5వేలు. వీటితోపాటు బుక్స్, ట్రాన్స్‌ఫోర్ట్ కోసం అదనం చెల్లించాలని సూచిస్తున్నారు.
Updated Date - Jun 20 , 2025 | 12:33 AM