ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బిల్లులు అందక అవస్థలు

ABN, Publish Date - May 23 , 2025 | 12:23 AM

మండలంలో 23 పంచాయతీలు ఉండగా, దాదాపు 55వేలకు పైగా జనాభా ఉంది. ప్రతి గ్రామంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులు గృహాలు నిర్మించుకు న్నారు.

తుగ్గలిలో మూసి ఉన్న హౌసింగ్‌ కార్యాలయం

పత్తాలేని హౌసింగ్‌ అధికారులు

బిల్లుల కోసం తిరుగుతున్న లబ్ధిదారులు

తుగ్గలి, మే 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో 23 పంచాయతీలు ఉండగా, దాదాపు 55వేలకు పైగా జనాభా ఉంది. ప్రతి గ్రామంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులు గృహాలు నిర్మించుకు న్నారు. అయితే బిల్లుల మంజూరుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, దరఖాస్తులు ఇవ్వడానికి తుగ్గలిలోని కార్యాలయం వస్తే హౌసింగ్‌ ఏఈ కనిపించడం లేదు. లబ్ధిదారులు మధ్యాహ్నం వరకు ఎదురు చూసి నిరాశతో ఇంటికి తిరిగి వెళ్తున్నారు. అయితే సచివాలయంలో కూడా ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు లేకపోవడంతో తుగ్గలికి రావాలిసి వస్తుందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. హౌసింగ్‌ అధికా రులు వారానికోసారైనా గ్రామానికి వస్తే బాగుంటదని అం టున్నారు. గిరిజన గ్రామం వైబీ తండాలో టీడీపీ సానుభూ తిపరులు దాదాపు 11 ఇళ్లు నిర్మించుకోగా 2018-19లో కింద బేస్‌మట్టం వరకు నిర్మించడంతో ఒక్కొక్కరికి రూ.25వేలు కూడా అందాయి. అనంతరం వైసీపీ ప్రభుత్వంలో బిల్లులు అందలేదు. అయినా లబ్ధిదారులు అప్పు చేసి మరీ ఇల్లు నిర్మించుకున్నారు. ఇప్పటికైనా తమకు బిల్లులు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఈ విషయమై ఇన్‌చార్జి డీఈ విజయకుమార్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Updated Date - May 23 , 2025 | 12:23 AM