ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గంగ పారని కాల్వలు

ABN, Publish Date - Jul 16 , 2025 | 12:23 AM

తెలుగుగంగ ప్రాజెక్టు నంద్యాల జిల్లా రైతాంగానికి వర ప్రసాదిని. 1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధి, ఏపీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, తమిళనాడు ముఖ్యమంత్రి మారుతూరు గోపాలన్‌రామచంద్రన్‌ తెలుగుగంగను ప్రారంభించారు.

తెలుగుగంగ ప్రధాన కాల్వలో రాళ్లు, మట్టి కుప్పలు ఇన్‌సెట్‌లో.. తుప్పుబట్టిన 21వ బ్లాక్‌ఛానెల్‌ షట్టర్‌

కూలిపోయిన టీజీ ప్రధాన కాల్వ సైడ్‌ వాల్‌

తుప్పుబట్టిన బ్లాక్‌ చానెల్‌ తూము షట్టర్లు

చివరి ఆయకట్టుకు అందని సాగునీరు

26, 27 బ్లాక్‌ఛానెళ్ల పనులు ప్రారంభం కాని వైనం

రుద్రవరం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): తెలుగుగంగ ప్రాజెక్టు నంద్యాల జిల్లా రైతాంగానికి వర ప్రసాదిని. 1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధి, ఏపీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, తమిళనాడు ముఖ్యమంత్రి మారుతూరు గోపాలన్‌రామచంద్రన్‌ తెలుగుగంగను ప్రారంభించారు. చెన్నై నగరానికి తాగునీరు, రాయలీసీమ ప్రాంతానికి సాగునీరు శ్రీశైలం జలాశయం నుండి శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరు నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు ద్వారా అందించడమే లక్ష్యం. కానీ ఈ కాలువలో ప్రస్తుతం నీరు పారడం లేదు. రైతుల ఆశలు అడియాశలయ్యాయి. తెలుగుగంగ ప్రధాన కాల్వ వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు నుంచి సుమారు 406 కి.మీ నిర్మాణం చేపట్టి చెన్నై కాల్వలకు అనుసంధానం చేశారు. నంద్యాల జిల్లాలో 96.14 కి.మీ పొడవునా గంగ ప్రధాన కాల్వ విస్తరించి ఉంది. కానీ దీని ప్రధాన కాల్వతో పాటు బ్లాక్‌ఛానెళ్ల నిర్వహణ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది.

తుప్పుబట్టిన గంగ బ్లాక్‌ఛానెల్‌ తూము షట్టర్లు..

తెలుగుగంగ ప్రధాన కాల్వ నుంచి ఉప కాల్వలకు నీరు విడిచేందుకు బ్లాక్‌ఛానెళ్ల తూములు ఏర్పాటు చేశారు. బ్లాక్‌ఛానళ్ల తూముల గేట్లు తుప్పుబట్టిపో యాయి. నిర్వహణ కరువవడంతో ఈ గేట్లు సక్రమంగా పనిచేయలేదు. ఇలాగైతే నీటి సరఫరా ఎలా అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభ సమయం దగ్గరలోనే ఉంది.

చివరి ఆయకట్టు భూములకు అందని సాగునీరు..

తెలుగుగంగ ప్రధాన కాల్వలో భాగంగా బ్లాక్‌ఛానెళ్ల నుంచి చివరి ఆయకట్టుకు సాగునీరందడంలేదని ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు రుద్రవరం మండలంలో చిలకలూరు, బి. నాగిరెడ్డిపల్లె, మందలూరు, చందలూరు, జంబులదిన్నె గ్రామాల రైతులకు సాగునీరు అందకపోవడంతో ఈసారి పంటలు ఎండిపోయాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో సాగునీరందక పంటలు ఎండిపోయాయి. అలాగే 26, 27 బ్లాక్‌ఛానెళ్ల పనులు ఇంత వరకు ప్రారంభించ లేదు. 2005లోనే పనులు ఆపివేశారు. ఇంత వరకు ఆ బ్లాక్‌ఛానెళ్ల పనులు ప్రజాప్రతినిధులకు అధికారులకు పట్టలేదు.

కూలిన గంగ ప్రధాన కాల్వ గట్లు సైడ్‌వాల్‌

గంగ ప్రధాన కాల్వలో భాగమైన బ్లాక్‌ఛానెల్‌ సమీపంలో సైడ్‌వాల్‌ కూలిపోయింది. బసాపురం సమీపంలో సైడ్‌వాల్స్‌ దెబ్బతిన్నాయి. శ్రీరంగాపురం సమీపంలోని గేట్ల వద్ద ప్రధాన కాల్వలో చెత్త చెదారం నిండిపోయింది.

1,14,500 ఎకరాల్లో ఆయకట్టు

నంద్యాల జిల్లాలో తెలుగుగంగ ప్రధాన కాల్వ కింద ఆయకట్టు 1,14,500 ఎకరాల ఆయకట్లు ఉంది. ఈ జిల్లాలో 96.14 కిమీ పొడవు ఉంది. మొత్తం 39 బ్లాక్‌ ఛానెళ్లు ఉన్నాయి. వీటిలో 1, 1ఆర్‌, 15ఎ, 15బి కాల్వలతో 39 బ్లాక్‌ ఛానెళ్లు ఉన్నాయి.

శిఽథిలమైన బ్లాక్‌ ఛానెళ్లు

బ్లాక్‌ఛానెళ్లలో సిమెంటు పనులు శిఽథిలమయ్యాయి. సిమెంటుతో నిర్మించిన తూముల రంధ్రాలు, సైడ్‌ గోడలు దెబ్బతిన్నాయి. వాటిని అధికారులు పట్టించుకోలే దని రైతులు విమర్శిస్తున్నారు. ఇలాగైతే గంగ నీరు పారేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టుల వద్ద సిమెంటుతో నిర్మించిన దిమ్మెలు పగిలి శిఽథిలమై కాల్వల్లో పడిపోయాయి.

బ్లాక్‌ఛానెళ్ల గట్టు బలహీనం

గంగ బ్లాక్‌ఛానళ్ల గట్టు బలహీనంగా మారాయి. గండ్లు పడితే రైతులే పూడ్చుకోవలసిన పరిస్థితి. కాల్వ గట్ల వెంట వెళ్లేందుకు కూడా కంపచెట్లు పెరిగిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ కోతకు గురై బలహీనంగా మారాయి. నీరు పూర్తి స్థాయిలో వదిలేందుకే లేదు. కారణం.. కాల్వగట్లు బలహీనంగా ఉన్నా యని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే చివరి ఆయకట్టుకు సాగునీరందడం లేదని రైతుల ఆవేదన. అధికారులకు ప్రజాప్రతినిఽ దులకు ఎన్నిసార్లు విన్నవిం చినా పెడచెవిన పెడుతున్నారు తప్ప బ్లాక్‌ఛానెళ్ల గట్లకు మరమ్మతులు చేయడం లేదు. శాశ్వతంగా చేయడంలేదని రైతుల వాదన.

గంగమ్మ చెరువుకు నీరు చేరడంలేదు

తెలుగుగంగ 19వ బ్లాక్‌ఛానెళ్ల నుంచి గంగమ్మ చెరువుకు నీరు చేరడంలేదు. అప్పనపల్లె సమీపంలో ఉపకాల్వకు తరచూ గండ్లు పడుతున్నాయి. గండ్లు పడకుండా కాల్వకు శాశ్వతమైన మరమ్మ తులు చేయాలి. గంగమ్మ చెరువుకు నీరందించి రైతులను ఆదుకోవాలి. సింగతల మహేంద్రరెడ్డి, రైతు, కొండమాయపల్లె

రైతులకు సాగునీరందించేందుకు కాలవలు సిద్ధం చేయాలి

రైతులకు ఖరీఫ్‌ సీజన్‌లో ఆయకట్టు భూములకు సాగునీరందించేందకు కాల్వ లకు మరమ్మతు చేయించాలి. కాల్వగట్లు బలహీనంగా ఉన్నాయి. కాల్వల్లో ఉన్న సిమెంటు పనులు దెబ్బతిని నీరు పారడం లేదు. వీటికి మరమ్మతు చేయించి చివరి ఆయకట్టుకు సాగునీరందేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి సీజనులో చివరి ఆయకట్టుకు సాగునీరందడం లేదు. - కల్లె మహేశ్వర్‌రెడ్డి

Updated Date - Jul 16 , 2025 | 12:23 AM