ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అక్కరకు రాని దుకాణాలు

ABN, Publish Date - Jun 21 , 2025 | 12:28 AM

పట్టణంలోని సంత మార్కెట్‌లో ఉన్న 27 దుకాణాలకు ఏడు నెలల క్రితం అధికారులు వేలం నిర్వహించారు

ఆలూరులో సంత్‌ మార్కెట్‌ వద్ద ఉన్న దుకాణాలు

దుకాణాలు దక్కించుకున్నా చేరేందుకు ఇష్టపడని వ్యాపారులు

సౌకర్యాలు, భద్రత లేకపోవడమే కారణం

26 షాపులు ఖాళీ

ఆలూరు, జూన్‌20(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సంత మార్కెట్‌లో ఉన్న 27 దుకాణాలకు ఏడు నెలల క్రితం అధికారులు వేలం నిర్వహించారు. దుకాణా లను చిరు వ్యాపారులకు స్వాధీనం చేసినా ఇంత వరకు ఒక్కరు మినహా మిగతా వారు వ్యాపారాలు ఆరంభించలేదు. తమకు ఆ దుకాణాలు వద్దని చిరు వ్యాపారులు తేల్చి చెబుతున్నారు.

పంచాయతీకి ఆదాయం, వ్యాపారులకు నష్టం

దుకాణాల వేలంతో గ్రామ పంచాయతీకి ఆదా యం సమకూరింది. అక్కడ వ్యాపారం సాగడం లేదని అక్కడికి వచ్చేందుకు చిరు వ్యాపారులు నిరా సక్తత వ్యక్తం చేస్తున్నారు. పాత బస్టాండు పరిసరా ల్లోని ఆకు కూరలు, పళ్లు, పూల వ్యాపారులు సంత మార్కెట్‌లోకి తరలిస్తే వ్యాపా రాలు సాగే అవకాశం ఉందం టున్నారు. అయితే విష యంలో పంచాయతీ అధికా రులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ తమ నుంచి అడ్వాన్స్‌ తీసుకుని ప్రతినెలా అద్దెను అందులో సరిచేస్తున్నారని వాపోతు న్నారు. దీనివల్ల గ్రామ పంచాయతీకి లాభం సమకూరిందే తప్ప తమకు ఓరిగేదేమీ లేదని డిపాజిట్‌ చెల్లించిన చిరు వ్యా పారులు వాపోతున్నారు.

అద్దె తగ్గించాలని కోరినా పట్టించుకోలేదు

సంత మార్కెట్‌ దుకాణాలకు అద్దె ఎక్కువగా ఉంది. అలాగే షాపింగ్‌ కాంప్లెక్స్‌కు భద్రత కూడా లేదు. పలుమార్లు ఈవిషయాన్ని పంచాయతీ అధి కారులను కలిసి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని వ్యాపారులు అంటున్నారు. ఇక చేసేదేమి లేక చెల్లించిన డిపాజిట్లు తిరిగి వచ్చే అవకాశం లేనందున గడువు ముగిసిన వెంటనే దుకాణాలను తిరిగా పంచాయతీకే స్వాధీనం చేసేందుకు చిరు వ్యాపారులు సిద్ధమవుతున్నారు.

దుకాణాల్లో సౌకర్యాలు లేవు

సంత మార్కెట్‌ దుకాణా న్ని వేలంలో దక్కించు కున్నా. తీరా అక్కడ కనీస సౌకర్యాలు, భద్రత లేదు. ఆ పాంత్రంలో వ్యాపారం జరిగే అవకాశాలు కూడా లేవు. అద్దె తగ్గించి, సౌకర్యాలు కల్పిస్తే చేరే అవకాశముంది. - షబ్బీర్‌, చిరు వ్యాపారి

వ్యాపారులు దుకాణాల్లో చేరాలి

వ్యాపారులు ముందుగా దకాణాల్లో చేరి వ్యాపారాలు చేస్తే అద్దె తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. దుకాణా లకు భద్రత కల్పించేందుకు ప్రహారీ కూడా నిర్మించాం. బస్టాండులో ఉన్న ఆకుకూ రలు, పండ్లు, పూల వ్యాపారులను ఇక్కడికే తరలిం చేందుకు చర్యలు తీసుకుంటాం. - ప్రభాకర్‌రావు, ఈవో, ఆలూరు గ్రామ పంచాయతీ

Updated Date - Jun 21 , 2025 | 12:28 AM