ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వర్షమా, నీ జాడ ఎక్కడ?

ABN, Publish Date - Jul 28 , 2025 | 12:02 AM

ఖరీఫ్‌ ప్రారంభంలో కురిసిన వర్షాలు అనంతరం మొహం చాటేయడంతో పంటలు ఎండుముఖం పట్టాయి.

ఎండుతున్న పత్తిపైరు

ఖరీఫ్‌ ప్రారంభంలో కురిసి, అనంతరం కురవని వర్షం

ఎండిపోతున్న పంటలు

దేవనకొండ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ ప్రారంభంలో కురిసిన వర్షాలు అనంతరం మొహం చాటేయడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఇలా అయితే పంటలు ఎండిపోయి పెట్టుబడి మట్టిపాలు అవుతుందని కర్షకులు ఆందోళన చెందుతున్నారు.

ప్రారంభంలో సమృద్ధిగా..

మండలంలో దాదాపు 60వేల ఎకరాల్లో ఈ ఏడాది పంటలు సాగుచేశారు. పత్తి, వేరుశనగ, అముదం అధికంగా సాగమాంమమి, ఇరవై రోజులుగా వర్షం లేకపొవడంతో పంటలు బెట్టకు లోనవుతున్నాయి. వారం నుంచి ఆకాశంలో మబ్బులు కనపిస్తున్నా వర్షం మాత్రం కురియడం లేదు.

ఈ గ్రామాల్లో కాలువలు లేవు..

కోటకొండ, తెర్నేకల్లు, చెల్లెలచెలిమిల, బంటుపల్లి, బండపల్లి, ఈదులదేవరబండ, మాచాపురం, గుండ్లకొండ, వెంకటాపురం గ్రామాల్లో హంద్రీ నీవా కాలువలు లేవు. దీంతో వర్షం వర్షం కురిస్తేనే పంటలు పండుతాయి.

వారంలోపు వర్షం కురిస్తేనే..

నాలుగెకరాల్లో పత్తి సాగుచే శాను. ఎకరాకు సుమారు రూ.30 వేలు ఖర్చుచేశా. ఇరవై రోజలుగా వర్షం కురవలేదు. మరో వారంలో కురియకపోతే పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. - వెంకటేష్‌, పుల్లాపురం

19:19:19 పిచికారీ చేయాలి

పంటలు వాడుముఖం పట్టే అవకాశం ఉంది. 19:19:19 ఫెర్టిలైజర్‌ను లీటర్‌ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేస్తే పదిరోజులపాటు పంటను కాపాడుకోవచ్చు. - ఉషారాణి, ఏవో, దేవనకొండ.

Updated Date - Jul 28 , 2025 | 12:02 AM