ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదు
ABN, Publish Date - Apr 28 , 2025 | 12:27 AM
ఏ ఒక్క రైతుకు అన్యాయం జరుగకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల ఎడ్యుకేషన్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ఏ ఒక్క రైతుకు అన్యాయం జరుగకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాల మార్కెట్‌యార్డులో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఆదివారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మార్క్‌ఫెడ్ డైరక్టర్ తులసిరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులకు అండగా ఉన్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. జొన్నలకు మార్కెట్లో ధరలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి రూ.3371ల ప్రభుత్వ మద్ధతు ధరతో అత్యంత వేగంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 30వేల మెట్రిక్ టన్నుల జొన్నల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందన్నారు. కొందరు రైతులు సంచులు బాగాలేవని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే వెనక్కి తీసుకొని మంచి సంచులను అందజేయాలని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాజునాయక్‌ను ఆదేశించారు.
Updated Date - Apr 28 , 2025 | 12:27 AM