సచివాలయం ఖాళీ
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:14 AM
మండలం లో సచివాలయ ఉద్యోగుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సచివాలయాలు ఉండగా, 150 మంది ఉద్యోగులు అవసరం. అయితే కేవలం 70 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
హాలహర్వి మండలంలో 150 ఉద్యోగులకు గాను పనిచేస్తున్నది 70 మంది
బదిలీల్లో మితిమీరిన రాజకీయ జోక్యం
డిప్యుటేషన్‌పై వెళుతున్న ఉద్యోగులు
హాలహర్వి, జూలై29(ఆంధ్రజ్యోతి): మండలం లో సచివాలయ ఉద్యోగుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సచివాలయాలు ఉండగా, 150 మంది ఉద్యోగులు అవసరం. అయితే కేవలం 70 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
మితిమీరిన రాజకీయ జోక్యం
సచివాలయ ఉద్యోగుల విషయంలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అపాయింట్‌మెంట్ పొందిన ఉద్యోగులు మూడేళ్ల అనంతరం రాజకీయ నాయకు లను ఆశ్రయించి డిప్యుటేష న్‌పై వెళ్లిపోతున్నారు. సచివాల య ఉద్యోగుల విషయంలో రాజకీయ నాయకులు అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన వారికి డిప్యుటేషన్లు ఇప్పిస్తున్నట్లు సమాచారం.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్..
సచివాలయ ఉద్యోగులకు తాజా నిర్వహించిన బదిలీ ల్లోనూ హాలహర్వి మండలానికి పూర్తిస్థాయిలో ఉద్యోగులను కేటాయించలేని సమాచారం. మొదట మారుమూల మండలాల ఖాళీను భర్తీ చేసిన అనంతరమే నియోజకవర్గ, జిల్లా, మండల కేంద్రాలకు ఉద్యోగులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. అయినా ఆ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
ప్రజల అవస్థలు..
ప్రభుత్వం ప్రజలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ద్రువపత్రాలు, వివిధ రకాల సేవలన్నీ సచివాలయాల ద్వారానే నిర్వహిస్తున్నారు. అయితే ఉద్యోగుల కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అలాగే సర్వేలు, అభివృద్ధి పనులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులే వాపోతున్నారు.
సిబ్బంది కొరత ఇలా..
మండలంలోని 15 సచివాలయాలకు 150 మంది ఉండాల్సిందిగా కేవలం బదిలీల్లో 70 మంది మాత్రమే ఈ మండలానికి రావడం జరిగింది. మిగతా 80 మంది ఉద్యోగులు ఇక్కడ భర్తీ కాలేదు. ఒకొక్క సచివాలయానికి ఒకరు ఇద్దరు మాత్రమే ఉన్నారు. దీంతో అన్ని శాఖల పనిభారం అంతా ఆ ఒకరిద్దరిపైనే పడడంతో నలిగిపోతున్నారు. ఉన్న వాళ్లు సైతం పనిభారంతో మరో మండలానికి వెళ్లాలని ప్రయత్నాలు ముమ్మరంగా పైరవీలు కొనసాగిస్తున్నారు. గ్రామాల ప్రజలు సిబ్బంది లేకపోవడం వల్ల తమ సమస్య ఎవరికి చెపకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
ఉద్యోగులను నియమించాలి
ఇటీవల సచివాలయ ఉద్యోగులకు బదిలీలు నిర్వహించినా మండలానికి కేటాయించకపో వడం విచారకరం. 80 మంది ఉద్యోగులు కొరత ఉంటే పనులు ఎలా అవుతాయి. కలెక్టర్ స్పందించి మండలానికి సిబ్బందిని నియమించాలి. - బసప్ప, మాజీ ఎంపీపీ, చింతకుంట
ఉద్యోగుల కొరతతో ఇబ్బందులు..
మండలంలో సచివాలయ ఉద్యో గుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న సిబ్బం దికే అదనపు బాధ్య తలు అప్పగిసు ్తన్నాం. సర్వేలు, సంక్షేమ పథకాల అమలులో మనమే ముందుంటున్నాం. సిబ్బంది కొరత తీర్చాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. - వరలక్మి, ఎంపీడీవో
Updated Date - Jul 30 , 2025 | 12:14 AM