ఆదోనికి నూతన మాస్టర్ ప్లాన్ మంజూరు
ABN, Publish Date - May 01 , 2025 | 12:38 AM
పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆదోనికి నూతన మాస్టర్ ప్లాన్‌ను మంజూరు చేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం మున్సిపల్ కమిషనర్ కృష్ణ తన చాంబర్‌లో నూతన మాస్టర్ ప్లాన్‌ను ప్రదర్శించారు.
ఆదోని టౌన్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ; పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆదోనికి నూతన మాస్టర్ ప్లాన్‌ను మంజూరు చేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం మున్సిపల్ కమిషనర్ కృష్ణ తన చాంబర్‌లో నూతన మాస్టర్ ప్లాన్‌ను ప్రదర్శించారు. 20 ఏళ్లపాటు అమలులో ఉండేలా కొత్త మాస్టర్ ప్లాన్ మంజూరు చేశారని, గృహ నిర్మాణదారులు ఇకపై ఈ మాస్టర్ ప్లాన్‌ను అనుసరించి ఇళ్లు నిర్మించుకోవలసి ఉంటుందని తెలిపారు. టీపీవో బాల మద్దయ్య సచివాలయం వార్డు ప్లానింగ్ సెక్రటరీ రాఘవ పాల్గొన్నారు.
Updated Date - May 01 , 2025 | 12:38 AM