ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రశాంతంగా ముగిసిన నీట్‌

ABN, Publish Date - May 05 , 2025 | 12:47 AM

వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ పరీక్ష (నీట్‌) ఆదివారం నంద్యాలలో ప్రశాంతంగా ముగిసింది.

పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

32 మంది విద్యార్థుల గైర్హాజరు

నంద్యాల ఎడ్యుకేషన్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ పరీక్ష (నీట్‌) ఆదివారం నంద్యాలలో ప్రశాంతంగా ముగిసింది. నాలుగు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1176 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1144 మంది హాజరు కాగా కాగా 32 మంది గైర్హాజరయ్యారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో 360 మంది అభ్యర్థులకు గాను 351 మంది, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో 216 అభ్యర్థులకు గానూ 211 మంది, టెక్కె ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో 360 మంది అభ్యర్థులకు గాను 351 మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో 240 మంది అభ్యర్థులకు గాను 231 మంది హాజరయ్యారు. అభ్యర్థులను సునిశిత పరిశీలన తర్వాతనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష జరిగినట్లు నీట్‌ కోఆర్డినేటర్‌ సత్యనారాయణ తెలిపారు.

‘నీట్‌’కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

నంద్యాల టౌన్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణంలో ఆదివారం జరిగిన నీట్‌ పరీక్షలు కట్టదిట్టమైన ఏర్పాట్లతో పరీక్షలు నిర్వహించినట్లు ఏఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్‌ తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్‌, బాలికల జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నీట్‌ అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏఎస్పీ భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించి సీఐ స్థాయి వారికి అక్కడ విధులు కేటాయించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా రాకుండా వారిని తనిఖీ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. చుట్టుపక్కన పరిసరాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Updated Date - May 05 , 2025 | 12:47 AM