ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి: డీఆర్వో

ABN, Publish Date - Jun 24 , 2025 | 12:18 AM

ప్రజా సమ స్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిం చాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్‌ అధికారు లను ఆదేశించారు.

వినతులు స్వీకరిస్తున్న డీఆర్వో రామునాయక్‌

పీజీఆర్‌ఎస్‌కు 325 దరఖాస్తులు

నంద్యాల నూనెపల్లె, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమ స్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిం చాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్‌ అధికారు లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌కు 325 దరఖాస్తులు వచ్చినట్లు డీఆర్వో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలన్నారు. పరిష్కరించిన ఫిర్యాదుదారుల అభిప్రాయసేకరణ కూడా త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో రీ ఓపెన్‌ అయిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలో ఉన్న దరఖాస్తులను పరిష్కరించడంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వోతోపాటు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 12:18 AM