పొగాకును కొనుగోలు చేయాలి
ABN, Publish Date - Apr 27 , 2025 | 12:55 AM
రైతులు పండించిన పొగాకు పంటను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.జగన్నాథం అన్నారు.
ఓర్వకల్లు, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన పొగాకు పంటను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.జగన్నాథం అన్నారు. శనివారం మండల కేంద్రమైన ఓర్వకల్లులోని జీపీఐ గోడౌన వద్ద ధర్నా చేశారు. కార్యక్ర మానికి రైతు సంఘం నాయకులు రమేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 18వేల ఎకరాల్లో పొగాకు పంటను సాగు చేశారన్నారు. అయితే కంపెనీలు రైతులను నమ్మించి ఒప్పించి విత్తనం ఇచ్చి పొగాకు క్వింటం రూ.15 వేలకు కొనుగోలు చేస్తామని చెప్పిన కంపెనీలు ఐటీసీ, జీపీఐ, ఈఎ స్‌టీ రైతులను రకరకాల పేరుతో మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి సుధాకర్, నాయకులు దొడ్డిపాడు బాషా, రాముడు, భీముడు పాల్గొన్నారు.
Updated Date - Apr 27 , 2025 | 12:55 AM