ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీఎడ్‌ కళాశాలలకు ఎన్‌సీటీఈ ఝలక్‌..!

ABN, Publish Date - Jun 27 , 2025 | 11:58 PM

దేశ వ్యాప్తంగా బీఎడ్‌ కళాశాలలకు అనుమతులు ఇచ్చే ఎన్‌సీటీఈ(నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌) చాలా కళాశాలలకు నోటీసులు జారీ చేసింది.

2025-26 గుర్తింపు రద్దు.. కొన్నింటికి నోటీసులు

కఠినమైన చర్యల దిశగా ఉన్నత విద్యామండలి

ఆర్‌యూ పరిధిలో చిక్కుల్లోపడ్డ యాజమాన్యాలు

మా దృష్టికి వస్తే చర్యలుతీసుకుంటాం: ఆర్‌యూ రిజిస్ట్రార్‌

కర్నూలు అర్బన్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా బీఎడ్‌ కళాశాలలకు అనుమతులు ఇచ్చే ఎన్‌సీటీఈ(నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌) చాలా కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. గడిచిన మే 14న జరిగిన సమావేశంలో మౌలిక వసతులు లేని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని 6 బీఎడ్‌, ఒక ఎంఎడ్‌ కళాశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి అనుమతులను రద్దు చేసింది. వాటిలో కొన్ని మూతపడగా మరి కొన్ని ప్రస్తుతం కోర్టు ఆర్డర్‌తో రన్నింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఎన్‌సీటీఈ నోటీసులు ఇస్తూ రద్దు చేయడంతో ప్రస్తుత విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వాటిలో శ్రీ సుధా- డోన్‌, శ్రీగాయత్రి- డోన్‌, శ్రీభారతి- నంద్యాల కళాశాలలకు ఎన్‌సీటీఈ నోటీసులు జారీ చేసినా అవి కొనసాగుతున్నాయి. 26, 27 మేలో ఎన్‌సీటీఈ 461 మీటింగ్‌లో 6 బీఎడ్‌, 3 ఎంఎడ్‌, 2 బీపీఎడ్‌ కళాశాలలను 2025-26 విద్యా సంవత్సరానికి రద్దు చేసింది. వాటిలో శ్రీ శంకరాస్‌, ఎంఎడ్‌ కర్నూలు, ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు కళాశాల, ఆదోని బీపీఎడ్‌ రన్నింగ్‌లో ఉన్నప్పటికీ ఎన్‌సీటీఈ నోటీసులు ఇచ్చింది. ఇవి రద్దయిన కళాశాలల జాబితాలో ఉన్నాయి.

పీఆర్‌ఏ నోటీసులు..

ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు మౌలిక వసతులు, అధ్యాపకులు లేని కొన్ని కళాశా లలకు పీఏఆర్‌ (పర్‌ఫార్మెన్స్‌ అప్రైసల్‌ రిపోర్టు) ఫైనల్‌ నోటీసులు ఇచ్చింది. వాటిలో రాయలసీమ యూనివర్సిటీ పరిఽఽధిలో బీఎడ్‌-24, ఎంఎడ్‌ 9, బీపీఎడ్‌ 4 ఇవ్వగా కొన్ని మూతపడ్డాయి. మరి కొన్ని రన్నింగ్‌లో ఉన్నాయి. మరి కొన్ని కోర్టు ఆర్డర్‌తో కొనసాగుతున్నాయి.

ఉలిక్కిపడ్డ వర్సిటీ..

బీఎడ్‌ కళాశాలలకు ఎన్‌సీటీఈ నోటిసులు ఇవ్వడంతో రాయలసీమ యూనివర్సిటీ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సొంతంగా భవనాలు లేకున్నా కొన్ని బీఈడీ కళాశాలలు రన్నింగ్‌లో ఉండటంతో ఎన్‌సీటీఈ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల వ్యవహారం వర్సిటీ అఽధికారులకు తలనొప్పిగా మారింది. అధికారులు కొన్ని బీఈడీ కళాశాలలకు కోర్టు ఆర్డర్‌ నేపథఽ్యంలో అనుమతి ఇచ్చినప్పటికీ ఎన్‌సీఈటీ రద్దు చేయడంతో బీఈడీ కళాశాలల సమస్య వర్సిటీ అధికారులకు అంతుచిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యామండలి బీఎడ్‌ కళాశాలలపై కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోందని వర్సిటీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్‌సీటీఈ నోటీసులపైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా చాలా బీఈడీ కళా శాలలకు ఎన్‌సీటీఈ గుర్తింపు రద్దయింది. రా ష్ట్రంలోని చాలా కళా శాలలకు ఫైనల్‌ నోటీసులు కూడా అందాయి. ఈ నోటీ సుల వ్యవహారంతో 2025-26 విద్యా సంవ త్సరం కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యం అవు తుందని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

మా దృష్టికి రాలేదు

నోటీసులు జారీ చేసినట్లు మా దృష్టికి రాలేదు. కనీసం మెయిల్‌ కూడా రాలేదు. ఆదేశాలు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం

- బోయ విజయకుమార్‌ నాయుడు, రిజిస్ట్రార్‌, ఆర్‌యూ

అడ్డగోలు అనుమతులు సరైన పద్ధతి కాదు

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో కొన్ని బీఈడీ కళాశాలల గుర్తింపును ఎన్‌సీటీఈ రద్దు చేసిన్పటికీ వర్సిటీ అఽధికారులు మాత్రం వాటికి అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారు. ఎన్‌సీటీఈ రద్దు చేసిన బీఈడీ కళాశాలలు, ఎన్‌సీటీఈ నోటీసులు అందుకున్న బీఈడీ కళాశాలల జాబితాను వర్సిటీ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలి.

- స్వామి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏబీవీపీ

Updated Date - Jun 27 , 2025 | 11:58 PM