ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దేశవ్యాప్త సమ్మె విజయవంతం

ABN, Publish Date - Jul 10 , 2025 | 12:48 AM

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని ఎమ్మిగనూరులో కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైంది.

ఎమ్మిగనూరు: సమ్మెలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు

ఎమ్మిగనూరుటౌన/రూరల్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని ఎమ్మిగనూరులో కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైంది. బుధవారం పట్టణంలో ఏఐటీయూసీ, సీఐటీ యూ, ఐఎఫ్‌ టీయూ, ఆశా, అంగనవాడీ, ఏఐకేఎస్‌, విద్యుత, ఆటో కార్మిక తదితర కార్మిక సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు రంగన్న యాదవ్‌, దాదావలి, జబ్బార్‌, నరసింహారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మల్లికార్జునగౌడ్‌, నాగశిరోమణి, వెంకటల క్ష్మి, కృష్ణవేణి, గ్రేషమ్మ, రంగలక్ష్మి, విశాలాక్షి, నాగలక్ష్మి, శైలజ పాల్గొన్నారు.

కోసిగి: కోసిగిలో రైతు సంఘం మండల కార్యదర్శి వీరేష్‌ అధ్యక్షతన సమ్మె చేపట్టారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం ముందు కార్మిక సంఘా ల నాయకులు మానవహారంగా చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్య క్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం కార్మికుల హక్కు లను కాలరాయడం సరికాదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మం డల కార్యదర్శి రాముడు, ఏఐటీయూసీ మండల నాయకులు గోపాల్‌, బీహెచపీఎస్‌ నాయకులు ఓంకార్‌ స్వామి, అంగనవాడీ యూనియన నాయకులు హెబ్సిబారాణి, లూసమ్మ, వరలక్ష్మి, సుజాత, ఆశా వర్కర్స్‌ నాయకులు వెంకటమ్మ, సుజాత, తదితరులు ఉన్నారు.

మంత్రాలయం: మంత్రాలయంలో ఏఐటీయూసీ నాయకులు భాస్కర్‌ యాదవ్‌, సీఐటీయూ మండల కార్యదర్శి భీమేశ్వరి, సీపీఎం మండల కార్యదర్శి జయరాజు ఆధ్వర్యంలో ఐసీడీఎస్‌ కార్యాలయం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ చేశారు. రాఘవేంద్ర సర్కిల్‌, తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ప్రాణేష్‌, లక్ష్మన్న, వీరేష్‌, విశా లాక్షి, మాధురి, తులశమ్మ, నరసమ్మ, శాంతి, భాగ్యలక్ష్మి, నాగమ్మ, రంగమ్మ, సుజాత, ప్రమీల, శ్వేత, స్వప్న, ఏరిషా, దేవపుత్ర, రాజు పాల్గొన్నారు.

గోనెగండ్ల: గోనెగండ్లలో పలు ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు ఎమ్మిగనూరు, కర్నూలు ప్రదానరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, అసంఘటిత కార్మికులకు సామాజికి భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీసీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆనందబాబు, సీఐటీయూ మండల నాయకులు నబిరసూల్‌, కేవీపీఎస్‌ నాయకులు కరుణకర్‌, అంగనవాడీ సంఘం నాయకురాలు నీరజ, ఈరన్నగౌడ్‌, మునెప్ప, పుష్ప, వరలక్ష్మి, వెంకటేశ్వరమ్మ, సుశాంతి, సుజాత నాయకులు పాల్గొన్నారు.

నందవరం: నందవరం బస్టాండ్‌లో సిఐటీయూ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అనంతరం నినాదాలు చేస్తూ తహసీ ల్దారు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు గురుశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, పీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సురేష్‌, అంగనవాడీ, ఆశవర్కర్ల యూనియన నాయకులు శారద, అరుణ, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

పెద్దకడుబూరు: పెద్దకడబూరులోని ఏఐటీయూసీ, ఐఎఫ్‌టియూ, సీపీఎం, సీపీఐ, ఆశా, అంగనవాడీ వర్క్‌ర్స్‌ యూనియన నాయకులు ఆధ్వర్యంలో సమ్మెను చేపట్టారు. ఆయా కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆయా కార్మిక సంఘాల నాయకులు నాగరాజు, జాఫర్‌పటేల్‌, రాజు, దేవదాసు, ఈరన్న, నరసింహులు ఆశా వర్కర్లు చిట్టెమ్మ, లలిత పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:48 AM