ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఓటరుగా నమోదు చేసుకోవాలి: జేసీ

ABN, Publish Date - May 22 , 2025 | 12:45 AM

18 సంవత్సరాలు నిండిన యువత ఓటు నమోదు చేసుకునేలా చూడాలని పాణ్యం పొలిటికల్‌ పార్టీ ప్రతినిధులకు జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య సూచించారు.

మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

కర్నూలు కలెక్టరేట్‌, మే 21(ఆంధ్రజ్యోతి): 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు నమోదు చేసుకునేలా చూడాలని పాణ్యం పొలిటికల్‌ పార్టీ ప్రతినిధులకు జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాలులో పాణ్యం నియోజకవర్గ పొలి టికల్‌ పార్టీ ప్రతినిధులతో జాయింట్‌ కలెక్టర్‌ నవ్య సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు పాణ్యం నియోజక వర్గంలో 1177 డూప్లికేట్‌ ఓట్లను గుర్తించి తొలగించామన్నారు. దాదాపు 500 నూతన ఓటర్లను నమోదు చేశామన్నారు. నియోజక వర్గంలో 1200 ఓట్లు దాటి ఉన్నటువంటి పోలింగ్‌ స్టేషనలను గుర్తించి అదనంగా ఉన్న ఓటర్లను పారం-8 ద్వారా ఒతర పోలింగ్‌ స్టేషన్లను బదిలీ చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం నవంబరు, డిసెంబరు, జనవరి మాసాలలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వివాహం చేసుకుని వెళ్లిన మహిళలు, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, వలసలు వెళ్లినవారు తమ ఓటును బదిలీ చేసుకోవచ్చ న్నారు. పొలిటికల్‌ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ బీఎల్‌వోలు క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లు వెరిఫికేషన జరిపి డూప్లికేట్‌ ఓట్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని ట్రాన్సజెం డర్లను గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించాలని జేసీని కోరారు. కార్యక్రమంలో జనసేన, బీఎస్పీ, బీజేపీ, సీపీఎం పార్టీల నాయకులు మంజునాథ్‌, రామశేషయ్య, నాగరాజు, రామకృష్ణ, ఐఎనపీ ఎస్‌. రజా క్‌వలి, కల్లూరు, పాణ్యం, గడివేముల తహసీల్దార్లు ఆంజనేయులు, నరేంద్రనాథ్‌రెడ్డి, వెంకటరమణ, ఓర్వకల్లు డీటీ రాజేష్‌, ఎలక్షన డీటీ తహసీల్దార్‌ జి.అనూరాధ పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:45 AM