ఇ-నామ్ అమలుకు మరిన్ని సౌకర్యాలు
ABN, Publish Date - Aug 01 , 2025 | 11:23 PM
రైతుల పంట ఉత్పత్తులకు పోటీ తత్వం కలిగిన అధిక ధర అందించేందుకు మార్కెట్ కమిటీలలో ట-నామ్ అమలుకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఢిల్లీకి చెందిన ఇ-నామ్ ప్రత్యేక బృంద సభ్యులు వెల్లడించారు. రెండో రోజు కేంద్రం బృందం ఆదోని మార్కెట్‌లో పర్యటించింది.
రెండో రోజు ఆదోని మార్కెట్‌లో ఢిల్లీ బృందం పర్యటన
ఆదోని అగ్రికల్చర్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రైతుల పంట ఉత్పత్తులకు పోటీ తత్వం కలిగిన అధిక ధర అందించేందుకు మార్కెట్ కమిటీలలో ట-నామ్ అమలుకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఢిల్లీకి చెందిన ఇ-నామ్ ప్రత్యేక బృంద సభ్యులు వెల్లడించారు. రెండో రోజు కేంద్రం బృందం ఆదోని మార్కెట్‌లో పర్యటించింది. వ్యాపారులు, రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులకు టెండర్ దాఖలు విధానం, తూకాలు, రైతులకు పంట ఉత్పత్తుల విక్రయ చెల్లింపులపై అధ్యయనం చేశారు. టెండర్ దాఖలలో కంప్యూటర్ ఆపరేటర్లకు పలు సూచనలు ఇచ్చారు. రోజు బిడ్డింగ్‌లో పాల్గొనే వ్యాపారుల గురించి ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇ-నామ్ సర్వర్ 2.0 కొత్త వెర్షన్ అమలకు కృషి చేస్తున్నాయన్నారు. రైతులకు ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలని సూచించారు. కమిషనర్లు, వ్యాపారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కడప మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లావణ్య, మార్కెట్ యార్డ్ కార్యదర్శి కల్పన, సహాయ కార్యదర్శి శాంత కుమార్, సూపర్ వైజర్లు మోహన్ రెడ్డి, నాగరాజు ఆనంద్ ఉన్నారు.
Updated Date - Aug 01 , 2025 | 11:23 PM