మెగా ‘పీటీఎం’ను పకడ్బందీగా నిర్వహించాలి
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:26 AM
జూలై 10వ తేదీన జి ల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో నిర్వ హించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం(పీటీఎం) ఏర్పాట్లు పక డ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశిం చారు.
కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, జూలై 6(ఆంధ్రజ్యోతి): జూలై 10వ తేదీన జి ల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో నిర్వ హించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం(పీటీఎం) ఏర్పాట్లు పక డ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశిం చారు. ఆదివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మెగా పీటీఎం 2.0కి సంబంధించి నియోజకవర్గ, మండల స్పెషల్ అధికారులతో, ఎంపీ డీవోలతో, మండల విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమానికి ఇన్‌చార్జి మంత్రి, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇతర ప్రజాప్రతి నిధులను, పూర్వ విద్యార్థులను ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తల్లి పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని 2.0ను పర్యవే క్షణ చేసేందుకు జిల్లాస్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులకు సంబంధించిన హెల్త్ స్కీనింగ్ త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. తల్లికి వందనం పథకం మిస్ అయి ఉంటే.. పాఠశాల వారిగా ఏ కారణం చేత తల్లికి వందనం పథకం లబ్ది చేకూరలేదనే లిస్టు తయారు చేయాలన్నారు. వీటిని స్వయంగా ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు పత్తికొండ ఆర్డీవోల స్ర్కూటీని చేయాలన్నారు. ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవోలు ఒక టీంగా ఏర్పడి ఈ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. జేసీ డా.బి.నవ్య, ఏఎస్పీ హుశేన్‌పీరా, ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్వో వెంకట నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 12:26 AM