చర్చ లేకుండానే ముగిసిన సమావేశం
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:39 AM
సమస్యలపై చర్చించాల్సిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పేలవంగా సాగింది. గురువారం చైర్ పర్సన్ లేకశ్వరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్ సందీప్ మాట్లాడు తూ కౌన్సిలర్లకు అజెండాను రెండు రోజుల ముందే ఇస్తే, మాట్లాడటానికి అవకాశం ఉంటుందన్నారు.
మధ్యలోనే వెళ్లిపోయిన కౌన్సిలర్లు
ఆదోని టౌన్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సమస్యలపై చర్చించాల్సిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పేలవంగా సాగింది. గురువారం చైర్ పర్సన్ లేకశ్వరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్ సందీప్ మాట్లాడు తూ కౌన్సిలర్లకు అజెండాను రెండు రోజుల ముందే ఇస్తే, మాట్లాడటానికి అవకాశం ఉంటుందన్నారు. బసాపురం చెరువుకు చేయాల్సిన మరమ్మతులపై డీపీఆర్ (డిటైల్డ్) తయారు చేయించడంలో తీవ్ర జాప్యం చేయడం సరికాదన్నారు. వైస్ చైర్మన్ ముల్లా గౌస్ మాట్లాడుతూ కుక్కల బెడదతో అనేక మంది కుక్కకాటుకు గురవుతున్నారన్నారు. హెల్త్ ఆఫీసర్ డా.సందీప్ మాట్లా డుతూ, కుక్కల సంఖ్య పెరగకుండా శస్త్రచికిత్స చేయిస్తున్నామని తెలి పారు. కౌన్సిలర్ బాలాజీ మాట్లాడుతూ బసా పురం చెరువుకు శాశ్వత మరమ్మతులు చేసేం దుకు రూ.కోట్లలో ఖర్చు అవుతోందని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కలిసి నిధుల మం జూరు చేయించాలన్నారు. కాగా సమావేశం జరుగుతుండగానే, కొందరు కౌన్సిలర్లు లేచి వెళ్లిపోవడం విచిత్రం కమిషనర్ కృష్ణ, ఎంఈ సత్యనారాయణ, డీఈలు వెంకట చలపతి, గోపినాథ్, అసిస్టెంట్ ఏసీబీ బాలముద్దయ్య పాల్గొన్నారు.
Updated Date - Aug 01 , 2025 | 12:39 AM