ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు: కలెక్టర్‌

ABN, Publish Date - May 10 , 2025 | 12:21 AM

మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజాకుమారి ఆదేశించారు.

నంద్యాల నూనెపల్లె, మే 9(ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజాకుమారి ఆదేశించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2024-2025పై సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణకు సంబంధిత అధికారులు నివేది కలు సేకరించి పకడ్బందీగా ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పిం చాలన్నారు. పాఠశాలలు కళాశాలల్లో మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాల నివారణ కోసం జూన్‌ 1 నుంచి 26వ తేదీ వరకు సంబంధిత అధికారులు నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభా వంతుల సహాయ సంచాలకులు ఫాతిమా, జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారి రవి కుమార్‌, డీవీఈవో సునీత, డీఈవో జనార్ధన్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ డా.జఫ్రూల్లా, ఐసీడీఎస్‌ పీడీ లీలావతి పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:21 AM