ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మృతుల ఆత్మకు శాంతి చేకూరాలి

ABN, Publish Date - Apr 24 , 2025 | 01:24 AM

జమ్ముకశ్మీర్‌ పహల్గాం, బైసాన్‌ సమీపంలో పర్యాటకులపై ఉగ్రదాడి పిరికి చర్యగా పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అభివర్ణించారు.

ర్యాలీ నిర్వహిస్తున్నఎమ్మెల్యే గౌరు చరిత, నాయకులు

పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత

మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ర్యాలీ

కల్లూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): జమ్ముకశ్మీర్‌ పహల్గాం, బైసాన్‌ సమీపంలో పర్యాటకులపై ఉగ్రదాడి పిరికి చర్యగా పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అభివర్ణించారు. ఉగ్రదాడిని ఖండిస్తూ చనిపోయిన వారిఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే నివాసం నుంచి అమ్మా హస్పిటల్‌ వరకు తనయుడు గౌరు జనార్ధన్‌రెడ్డితో కలిసి ఎమ్యెల్యే కొవ్వొత్తులు వెలిగించి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానూభూతి ప్రకటించారు. నంద్యాల పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్‌, బి.నాగిరెడ్డి, ఈవీ.రమణ, డి.రామాంజనేయులు, మాదేశ్‌ టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆధ్వర్యంలో..

పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చెన్నమ్మసర్కిల్లో ర్యాలీ నిర్వహించారు. పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడి దిగ్ర్బాంతి కలిగించిందన్నారు. ఈదాడిలో ఏపీకి చెందిన చంద్రమౌలి, మధుసూదన్‌తో పాటు 28 మందిని కోల్పోవటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే కాటసాని ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - Apr 24 , 2025 | 01:25 AM