ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎర్రజెండా రెపరెపలు

ABN, Publish Date - May 01 , 2025 | 11:18 PM

నియోజ కవర్గంలో ఎర్ర జెండా రెపరెపలాడింది. గురువారం 135వ మేడే వేడుకలను పురస్కరించుకొని సీఐటీ యూ నాయకులు పట్టణంలో 25చోట్ల జెండాను ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు ఈరన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశులు, అంగన్‌వాడి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమ్మ, సీఐటీయూ పట్టణ అద్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, గోపాల్‌, ఉపాధ్యక్షుడు లక్ష్మన్న జెండాను ఆవిష్కరించారు

పత్తికొండలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య

ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో మే డే వేడుకలు

ర్యాలీ నిర్వహించిన కార్మికులు, వామపక్షాలు

ఆదోని అగ్రికల్చర్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): నియోజ కవర్గంలో ఎర్ర జెండా రెపరెపలాడింది. గురువారం 135వ మేడే వేడుకలను పురస్కరించుకొని సీఐటీ యూ నాయకులు పట్టణంలో 25చోట్ల జెండాను ఆవిష్కరించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు ఈరన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశులు, అంగన్‌వాడి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమ్మ, సీఐటీయూ పట్టణ అద్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, గోపాల్‌, ఉపాధ్యక్షుడు లక్ష్మన్న జెండాను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మికులంతా 139ఏళ్ల క్రితం ప్రాణత్యాగాలు చేసి తమ హక్కులను సాధించుకున్నారన్నారు. కాగా ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్‌ రఫి మే డే నిర్వహిం చుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎఫ్‌టీయూ నాయకులు భీమాస్‌ సర్కిల్‌ నుంచి ర్యాలీ చేపట్టారు. పీడీఎస్‌ యూ జిల్లా అధ్యక్షుడు అఖండ, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి వెంకప్ప, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున జెండాను ఆవిష్కరిం చారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌కు అప్పనంగా అప్పజేబుతోందని ఆరోపించారు.

కార్మిక హక్కును కాలరాస్తున్న మోదీ : రామచంద్రయ్య

పత్తికొండ టౌన్‌: ఎన్నో పోరాటాలతో సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు. గురువారం 139వ మేడే పురస్కరించుకుని స్థానిక ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌ నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు. కార్మికులు అనంతరం అంబేడ్కర్‌ సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో రామచంద్రయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామక వేత్తలకు ఊడిగం చేస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టికంటయ్య, డిప్యూటీ కార్యదర్శి కృష్ణయ్య సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబీరసూల్‌, రాజాసాహెబ్‌, కారుమంచి పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, తుగ్గలి కార్యదర్శి సుల్తాన్‌, గురుదాసు, కారన్న, ఏఐటీయుసీ తాలుకా కార్యదర్శి రంగన్న, నాయకులు రాజప్ప, మాదన్న, సిద్దలింగప్ప, గుండుబాషా, మాదన్న పాల్గొన్నారు.

కార్మిక హక్కులకై పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌ పిలుపునిచ్చారు. గురువారం సీఐటీయు ఆధ్వర్యంలో మేడే నిర్వహించారు. రంగారెడ్డి, దస్తగిరి, గోపాల్‌ పాల్గొన్నారు.

మద్దికెర: మండలంలోని మద్దికెర, ఎం.అగ్రహారం, పెరవలి గ్రామాల్లో మే డే వేడుకలను నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, హామాలీ, ఆటో కార్మికుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. ఈ సందర్బంగా మండల సీపీఐ కార్యదర్శి నాగరాజు, పట్టణ టీడీపీ అధ్యక్షులు గడ్డం రామాంజులు, బెల్దార్‌ సంఘం నాయకులు రాముడు, శేఖర్‌, రంగస్వామి మాట్లాడుతూ కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకుని రావాలన్నారు.

ఆస్పరి: మండలంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, కార్మిక అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గురువారం మేడే నిర్వహించారు. ఆస్పరితోపాటు కైరుప్పుల, బిల్లేకల్‌ గ్రామాల్లో ఏఐటీయూసీ సీపీఐ జిల్లా సభ్యుడు నాగేంద్రయ్య, ఏఐటీయూసీ తాలుకా అధ్యక్షుడు కృష్ణమూర్తి జెండాను ఆవిష్కరించారు. హనుమంతప్ప, బాలకృష్ణ, ఎలక్ర్టిసిటీ 1104 యూనియన్‌ నాయకులు గోపాల్‌రెడ్డి, శేషప్ప, రవి, తదితరులు పాల్గొన్నారు.

తుగ్గలి: జొన్నగిరి కూడలిలో మేడే పురస్కరించుకుని సీపీఐ నాయకులు నబీ రసూల్‌, సుల్తాన్‌లు జెండా ఆవిష్కరించారు. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఆలూరు: కార్మిక హక్కుల కోసం పోరాడాలని సీపీఐ నాయకుడు భూపేష్‌ పిలుపునిచ్చారు. గురువారం మే డే సందర్భంగా సీఐటీయూ కార్యాలయం వద్ద సీపీఐ మండల కార్యదర్శి రామాంజనేయులు జెండాను ఆవిష్కరించారు. కార్మికుల, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. గోపాల్‌, రంగన్న, చంద్రకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. సీపీఎం నాయకుడు నారాయణ స్వామి జెండా ఎగురవేశారు. షాకీర్‌, కృష్ణ, మైన పాల్గొన్నారు.

వెల్దుర్తి టౌన్‌: సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం 139వ మే డే వేడుకలను మండల అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు మారెన్న, చిన్న ఏసు ఆధ్వర్యంలో నిర్వహించారు. మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యాలయంలో మాజీ ఎంపీపీ బొమ్మన దశరథరామిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. బజార్‌ హామాలీ యూనియన్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి జే.నాగేశ్వరరావు జెండాను ఆవిష్క రించారు. పాత బస్టాండులోని బజార్‌ హామాలీ యూనియన్‌ సీఐటీయూ జెండాను పెద్ద ఏసు, న్యూబస్టాండు, రామళ్లకోట మోటారు వర్కర్స్‌ యూనియన్‌ కార్యాలయంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నగేష్‌ ఆవిష్కరించారు.

దేవనకొండ: కార్మిక, కర్షకుల హక్కుల సాధనకు పోరుబాట పట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరశేఖర్‌, ఆనంద్‌బాబు, సీపీఐ నాయకులు మద్దిలేటిశెట్టి, నర్సారావ్‌ అన్నారు. తెర్నేకల్‌, పి.కోట కొండలో ఆవిష్కరించారు. ఏఐటీయూసీ కార్యాలయం వద్ద సీఐ వంశీనాథ్‌ అన్నదానం చేశారు.

Updated Date - May 01 , 2025 | 11:18 PM