టీచర్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:30 AM
సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపా ధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఉపా ధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ముట్టడి చేశారు.
ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక డిమాండ్
కర్నూలు ఎడ్యుకేషన్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపా ధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఉపా ధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ముట్టడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 8 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఎస్‌జీటీలకు ప్రాధాన్యత క్రమంలో 3,500 ఖాళీలు ఆప్షన్లుగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లాపై పూర్తిగా అవగాహన ఉన్న వారు మాత్రమే ఆప్షన్ ఇచ్చుకోగలరన్నారు. లేకపోతే ఉపాధ్యాయులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. మహిళా సెకండరీ గ్రేడ్ టీచర్లకు వెబ్‌ఆప్షన్ ఒక్కరోజులో ఇవ్వడం అసాధ్యమని, పొరపాట్లు జరిగితే రెండు సంవత్సరాలపాటు దాని ఫలితం అనుభవించాల్సి వస్తుందన్నారు. ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్‌రావు, ఆపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్లు సేవాలాల్ నాయక్ పాల్గొన్నారు.
Updated Date - Jun 09 , 2025 | 12:30 AM