మాట్లాడుతున్న ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ABN, Publish Date - Apr 10 , 2025 | 12:07 AM
మండల కేంద్రంలో ఈనెల 12న హనుమాన్ శోభా యాత్రను శాంతియుతంగా చేసుకోవాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ డీఎస్పీ వెంకట రామయ్య సూచించారు.
హొళగుంద, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఈనెల 12న హనుమాన్ శోభా యాత్రను శాంతియుతంగా చేసుకోవాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ డీఎస్పీ వెంకట రామయ్య సూచించారు. బుధవారం పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని, అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలూ రు సీఐ రవిశంకర్ రెడ్డి , తహసీల్దార్ నిజాముద్దీన్, ఎంపీడీవో విజయ లలిత, ఎస్సై దిలీప్ కుమార్, కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
Updated Date - Apr 10 , 2025 | 12:07 AM