బస్టాండ్ పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - May 30 , 2025 | 12:12 AM
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు
మరుగుదొడ్డిని పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్
సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, మే 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. గురువారం ఆర్టీసీ బస్టాం డును ఆయన పరిశీలించారు. మరుగు దొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడంపై అంసతృప్తి వ్యక్తం చేశారు. శుభ్రంగా ఉంచాలని డిపో మేనేజర్‌ను ఆదేశించారు. ఆవరణలో ప్రైవేటు వాహనాల పార్కిం గ్‌ను గమనించి, వాటికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బస్సుల సమయపాలన, సదుపాయాల గురించి ప్రయాణికులను అడిగారు. బస్సులు లోపలకు వచ్చే, బయటకు వెళ్లే ప్రాంతంలో రహదారిని సరిచేయించాలని ఆదేశించారు.
Updated Date - May 30 , 2025 | 12:12 AM