పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:33 AM
రుణం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని ఉద్యోగి సతాయించడంతో విసిగి వేసారిన పురుగుమందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనంలో మంత్రాలయంలోని ఐకేపీ కార్యాల యం ముందు బుధవారం చోటుచేసుకుంది.
రుణం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని వేధించడంతో..
మంత్రాలయం వెలుగు కార్యాలయం ముందు ఘటన
మంత్రాలయం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రుణం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని ఉద్యోగి సతాయించడంతో విసిగి వేసారిన పురుగుమందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనంలో మంత్రాలయంలోని ఐకేపీ కార్యాల యం ముందు బుధవారం చోటుచేసుకుంది. బాధితుడి బంధు వులు తెలిపిన వివరాలు.. కోసిగి మండలం వందగల్లు గ్రామానికి చెందిన బసవరాజు నుంచి కౌతాళం మండలం కరిణి గ్రామానికి చెందిన వీబీకే శ్రీరాములు ఆదోని హెచ్‌డీఎస్‌పీ బ్యాంకులో ఇంటిపై రుణం ఇప్పిస్తామని రూ.18,500 తీసుకున్నాడు. అంత టితో ఆగకుండా మరో రూ.50వేలు డిపాజిట్ కోసం తీసుకుని రెండు నెలలుగా రుణం ఇప్పించలేదు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా సతాయిస్తున్నాడు. కౌతాళం మండలంలో వెలుగు ఏపీఎంగా అప్పట్లో పని చేసిన రాజశేఖర్, కరణి వీబీకే శ్రీరాము లుకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఏడు నెలల క్రితం కౌతాళం ఏపీఎం నుంచి మంత్రాలయానికి బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. గృహ నిర్మాణానికి శ్రీనివాసులు, అప్పట్లో కౌతాళంలో పని చేస్తున్న వెలుగు కార్యాలయంలో పని చేస్తున్న ఏపీఎం రాజశేఖర్‌కు సంబంధం ఉందని, బుధవారం మంత్రాలయం వెలుగు కార్యాలయానికి బాధితుడు బసవరాజు, పిన్ని లక్ష్మిదేవితో కలిసి వచ్చాడు. రాజశేఖర్‌ను డబ్బులు ఇప్పిం చాలని అడిగాడు. శ్రీరాములుతో మాట్లాడుతానని చెప్పారు. అంతలోనే ఆఫీసు ముందు తనవెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి సృహ తప్పిపడిపోయాడు. గమనించిన ఆఫీసులోని అధికారులు, లక్ష్మిదేవి రక్షించే ప్రయత్నం చేశారు. స్పృహ కోల్పోవడంతో 108అంబులెన్సు ద్వారా ఎమ్మిగ నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రాలయం వెలుగు కార్యాలయంలో పురుగు మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డాన్న విషయంతో చర్చనీయాంశంగా మారింది. బాధితుడికి భార్య జయమ్మ, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.
వీబీకే డబ్బులు ఇవ్వకపోవడంతోనే..
గతంలో కౌతాళం మండలంలోని కరణికి చెందిన వీబీకే శ్రీరాములు తనతో చనువుగా ఉండేవాడు. అతను ప్రైవేటు బ్యాంకులలో వ్యక్తిగత, ఇంటిపై రుణాలు ఇప్పించేవాడు. అదేవి ధంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బసవరాజు శ్రీరాము లుకు ఇంటిపై రుణం ఇప్పించాలని రూ.18,500లు ఇచ్చాడు. ఆ డబ్బులు చెల్లించాలని అడిగినా వీబీకే పట్టించుకోలేదు. బుధవారం తన చిన్నమ్మ లక్ష్మిదేవితో తన కార్యాలయానికి వచ్చి కార్యాలయం ముందు శ్రీరాములుతో రుణం ఇప్పించాలని, మీతోనే ఇది సాద్యమవుతుందని, ఎలాగైనా ఇప్పించి న్యాయం చేయాలని కోరారని తెలిపారు. అంతలోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇందుకు కారణం శ్రీరాములే తనకు ఎలాంటి సంబంధం లేదు.
- రాజశేఖర్, వెలుగు ఏపీఎం, మంత్రాలయం
Updated Date - Jun 26 , 2025 | 12:33 AM