ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమాయణం!

ABN, Publish Date - May 08 , 2025 | 12:52 AM

ఇన్‌స్టాగ్రాం ద్వారా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్‌ అయిన అనూషను ఆదోని మండలంలోని సలకలకొండకు చెందిన గోపీనాథ్‌ ప్రేమాయణం సాగించాడు. పె

ఆందోళన చేస్తున్న ట్రాన్స్‌జెండర్‌, ఇన్‌సెట్‌లో అనూష గోపినాథ్‌ సెల్ఫీ (ఫైల్‌)

పెళ్లి చేసుకున్న యువకుడు

ముఖం చాటేసి స్వగ్రామానికి

భర్త ఇంటి ముందు అనూష నిరసన

ఆదోని రూరల్‌, మే 7(ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రాం ద్వారా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్‌ అయిన అనూషను ఆదోని మండలంలోని సలకలకొండకు చెందిన గోపీనాథ్‌ ప్రేమాయణం సాగించాడు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లో కొన్నాళ్ల పాటు కాపురం పెట్టాడు. చివరకు చెప్పా పెట్టకుండా గోపీనాథ్‌ స్వగ్రామానికి చేరుకున్నాడు. దీంతో భర్త కోసం ట్రాన్స్‌జెండర్‌ అనూష తన సహాచర ట్రాన్స్‌జెండర్లతో కలిసి సలకలకొండకు వచ్చి రెండు రోజులుగా భర్త ఇంటి ముందు దీక్ష చేస్తోంది. దీంతో వీరి ప్రేమ కథ తాలుకా పోలీస్‌స్టేషన్‌కు చేరింది.

న్యాయం కోసం నిరసన

తాను న్యాయం కోసం నిరసన చేస్తున్నట్లు ట్రాన్స్‌జెండర్‌ అనూష తెలిపింది. నాలుగేళ్లుగా మా ప్రేమాయణం సాగింది. గోపీనాథ్‌ బలవంతంతోనే ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాం. వారం రోజుల క్రితం నాకు చెప్పకుండా నా భర్త తన స్వగ్రామానికొచ్చాడు. ఈవిషయం తెలుసుకొని ఇక్కడికొచ్చాను.

అనైతిక సంబంధాలకు దూరంగా ఉండాలి

యువత అనైతిక సంబంధాలకు దూరంగా ఉండాలి. చెడుమార్గంలో కాకుండా సన్మార్గంలో నడవాలి. అనైతిక బంధాల ద్వారా అటు సమాజంలో, ఇటు కుటుంబంలో అవమానాలకు గురి కావాల్సి ఉంటుంది. ట్రాన్స్‌జెండర్‌ అనూష, గోపినాథ్‌ ప్రేమ వ్యవహరంపై విచారణ చేపట్టాం. తదుపరి చర్యలు తీసుకుంటాం. - సి.నల్లప్ప, రూరల్‌ సీఐ, ఆదోని

Updated Date - May 08 , 2025 | 12:52 AM