కేఎంసీ గ్రౌండ్‌ను కాపాడుకుందాం
ABN, Publish Date - Aug 01 , 2025 | 01:09 AM
కర్నూలు మెడికల్ కాలేజీ గ్రౌండ్‌ను కాపాడుకుంటామని భారత విద్యార్థి ఫెడరేషన (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా అధ్యక్షుడు సాయి ఉదయ్ అన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సాయి ఉదయ్
కర్నూలు హాస్పిటల్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్ కాలేజీ గ్రౌండ్‌ను కాపాడుకుంటామని భారత విద్యార్థి ఫెడరేషన (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా అధ్యక్షుడు సాయి ఉదయ్ అన్నారు. గురువారం మధ్యాహ్నం కర్నూలు మెడికల్ కాలేజీ ఎదుట ఎస్‌ఎప్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సాయి ఉదయ్ మాట్లా డుతూ కర్నూలు మెడికల్ కాలేజీకి ఎంతో ఘన చరిత్ర ఉందని, మానసిక ఒత్తిడితో ఉన్న వైద్యులు, వైద్య విద్యార్థులకు మైదానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఒకప్పుడు మెడికల్ కాలేజీ మైదానం 8 ఎకరాలు ఉండేదని, ప్రస్తుతం 5 ఎకరాలకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ లేని సమయంలో పూర్వ విద్యార్థులు మైదానంలో ఇంజనీర్లతో ఎలా కొలతలు వేస్తారని, తక్షణమే ప్రిన్సిపాల్ వైద్యుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి జూనియర్ డాక్టర్ల అభిప్రాయాన్ని తీసుకోవాలని కోరారు. కార్యక్ర మంలో ఎస్‌ఎప్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అంజి, సహాయ కార్యదర్శి అబుబకార్, నగర కార్యదర్శి పృథ్వి యోగి, మహేష్ పాల్గొన్నారు.
Updated Date - Aug 01 , 2025 | 01:09 AM