ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకువద్దాం

ABN, Publish Date - Jul 13 , 2025 | 12:08 AM

తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకువద్దామని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నంది వెలుగు ముక్తేశ్వరరావు పేర్కొన్నారు.

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ముక్తేశ్వరరావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సాహితీవేత్తలు

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు

ఘనంగా రాష్ట్ర తెలుగు భాషా పరిరక్షణ సదస్సు ప్రారంభం

నగరంలో భారీ ర్యాలీ

వివిధ జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధులు

కర్నూలు కల్చరల్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకువద్దామని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నంది వెలుగు ముక్తేశ్వరరావు పేర్కొన్నారు. అధికార భాషగా, బోధనా భాషగా తెలుగును అమలు చేయడంతోపాటూ ప్రథమ భాషగా, మాతృభాషగా తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ రెండు రోజుల రాష్ట్రస్థాయి తెలుగు భాషా పరిరక్షణ సదస్సు శనివారం కర్నూలులో ఘనంగా ఆరంభమైంది. కొండా రెడ్డి బురుజు సమీపంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద భాషాభిమానులు, సాహితీవేత్తలు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన సదస్సు ప్రతినిధులు, విద్యార్థులు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలుగు భాషను పరిరక్షించాలంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. తెలుగు తల్లి విగ్రహం నుంచి కిడ్స్‌ వరల్డ్‌, రాజ్‌విహార్‌ సర్కిల్‌, బుధవారపేట మీదుగా కలెక్టరేట్‌ ముందు గల మాజీ సీఎం ఎన్టీఆర్‌ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ముక్తేశ్వరరావు రచించిన ‘అప్పుడు రాష్ట్రం కోసం...ఇప్పుడు భాష కోసం’ అనే పుస్తకాన్ని సాహితీవేత్తలు ఆవిష్కరించారు. సదస్సు కార్యదర్శి డాక్టర్‌ దండెబోయిన పార్వతీదేవి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ సదస్సులో మద్రాసు తెలుగు సంఘం అధ్యక్షుడు తూమాటి సంజీవరావు, నరసం జిల్లా అధ్యక్షురాలు కా.వెం.సుబ్బలక్ష్మమ్మ, డీఎస్పీ మహబూబ్‌ బాషా, ఎం. లక్ష్మయ్య ప్రసంగించారు.

తొలిరోజు సదస్సు రెండో సెషన్‌లో వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన తెలుగు భాషా ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. తెలుగు భాషా పరిరక్షణ, ఉన్నతి, అమలు తదితర అంశాలపై తగిన సూచనలు చేశారు. ఈ అంశాలపై ఆదివారం జరిగే ముగింపు సదస్సులో మరోసారి చర్చించి, తీర్మానాలు చేసి కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించాలని సదస్సు బాధ్యులు నిర్ణయించారు. అంతకు ముందు సునీత వ్యాఖ్యానంతో నృత్య గురువు కరీముల్లా శిష్య బృందం ప్రదర్శించిన నృత్య రూపకాలు, ఎలమర్తి రమణయ్య, జేఎస్‌ఆర్‌కే శర్మ, కళారత్న పత్తి ఓబులయ్య, గాయని సుజాత ఆలపించిన తెలుగు పద్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి.

రేపటి తరాలకు అందించాలి..

తెలుగు గొప్పదనాన్ని రేపటి తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తల్లిదండ్రులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులపై ఉందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు అన్నారు. గతమెంతో ఘనకీర్తి ఉన్న తెలుగు భాషను నేడు నిర్లక్ష్యం చేస్తున్నారని, మాతృభాషలో బోధన సాగితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఈ సదస్సులో తెలుగు భాషను ఎలా కాపాడుకోవాలనే అంశంపై చర్చలు చేసి తీర్మానాలను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.

చారిత్రక సదస్సులు నిలిచిపోవాలి : కేసీ కల్కూర

సభకు అధ్యక్షత వహించిన సదస్సు అధ్యక్షుడు కేసీ కల్కూర మాట్లాడుతూ రెండు రోజుల పాటూ కొనసాగే ఈ సదస్సు ఒక చారిత్రక సదస్సులా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. నాడు పొట్టి శ్రీరాములు త్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే, అయితే 70 ఏళ్లు గడుస్తున్నా తెలుగు అధికా రిక భాషగా లేకపోవడం బాధాకరమని చెప్పారు.

చింతామణి నాటకంపై నిషేధం ఎత్తివేయాలి : పత్తి ఓబులయ్య

కాళ్లకూరి నారాయణ రావు వందేళ్ల క్రితం రాసిన ‘చింతామణి’ నాటకాన్ని గత ప్రభుత్వం నిషేధించిందని, ఆ నిషేధాన్ని ఎత్తివేసేలా ప్రభుత్వం చూడాలని మరో అతిథి, కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కోరారు. ప్రభుత్వం తెలుగు అకాడమీని పునఃప్రారంభించాలని, అధికార భాషా సంఘం ఏర్పాటు చేసి తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. ఎవరో కొందరు వాస్తవ కథను పక్కదారి పట్టించడం వల్ల ఒక వర్గానికి ఇబ్బంది కలిగిందని, రచయిత రాసిన విధంగా పుస్తకాన్ని యఽథావిధిగా ప్రదర్శిస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండబోదని చెప్పారు.

తెలుగు భాషకు జీవం పోస్తూ.. జేఎన్‌ఆర్‌కే శర్మ

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ తెలుగు భాషకు జీవం పోస్తూ అనేక సంస్కరణలు చేశారని సదస్సు ఉపాధ్యక్షుడు జేఎన్‌ఆర్‌కే శర్మ మాట్లాడుతూ గుర్తు చేశారు. నేడు తెలుగు భాషకు పూర్వవైభవాన్ని కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 12:08 AM