ల్యాప్‌టాప్‌లను వినియోగించుకోవాలి
ABN, Publish Date - May 20 , 2025 | 12:36 AM
ల్యాప్‌టాప్‌లను వినియోగించుకోని నైపుణ్యాలు పెంచుకోవాలని కలెక్టర్ పి.రంజిత బాషా సూచించారు.
ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్న కలెక్టర్ రంజిత బాషా
కలెక్టర్ రంజిత బాషా
కర్నూలు కలెక్టరేట్, మే 19(ఆంధ్రజ్యోతి): ల్యాప్‌టాప్‌లను వినియోగించుకోని నైపుణ్యాలు పెంచుకోవాలని కలెక్టర్ పి.రంజిత బాషా సూచించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటో రియం లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన ల్యాప్ టాప్‌లను ఇద్దరు విద్యార్థినులకు కలెక్టర్ అందజేశారు. కలెక్టర్ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్, డిగ్రీ తదితర ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లను అందజే స్తుందన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రయీస్ ఫాతిమా పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 12:36 AM