కార్మికులకు చట్టాలపై అవగాహన ఉండాలి
ABN, Publish Date - May 08 , 2025 | 01:00 AM
కార్మికులకు చట్టాలపై అవగాహన ఉండాలని పత్తికొండ జూనియర్ సివిల్ న్యాయాధికారి టి.జోత్స్నదేవి అన్నారు.
మాట్లాడుతున్న న్యాయాధికారి జోత్స్నదేవి
న్యాయాధికారి జోత్స్నదేవి
పత్తికొండ టౌన్, మే 7 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు చట్టాలపై అవగాహన ఉండాలని పత్తికొండ జూనియర్ సివిల్ న్యాయాధికారి టి.జోత్స్నదేవి అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కార్మిక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయాధికారి మాట్లాడుతూ ప్రతి కార్మికుడు 8 గంటలు మాత్రమే పని చేయాలని, ప్రమాదంలో నష్టం వాటిల్లినప్పుడు పరిహారం పొందవచ్చునన్నారు. పంచాయతీ ఈవో నరసింహులు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మధుబాబు, న్యాయవాదులు సురాజ్‌నబీ, నగేష్,గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
Updated Date - May 08 , 2025 | 01:00 AM