ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి

ABN, Publish Date - Jun 07 , 2025 | 11:39 PM

అమరావతి ప్రాంత మహిళలపై జగన్‌రెడ్డి అనుచరులు వాడిన అసభ్య పదజాలం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, వెంటనే వైఎస్‌ జగన్‌ క్షమాపణలు చెప్పాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు.

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

ఆత్మకూరు, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రాంత మహిళలపై జగన్‌రెడ్డి అనుచరులు వాడిన అసభ్య పదజాలం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, వెంటనే వైఎస్‌ జగన్‌ క్షమాపణలు చెప్పాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ మహిళలు, ఆడబిడ్డల జోలికి వస్తే ఎవర్నీ ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టంగా హెచ్చరించారన్నారు. అయినప్పటికీ జగన్‌ మీడియాలో అమరావతి ప్రాంత మహిళలను ఘోరంగా అవమానించడం దారుణమన్నారు. ఆ మీడియాలో ఓ జర్నలిస్టు మహిళలను కించపరిచేలా మాట్లాడిన తీరు సిగ్గుచేటన్నారు. అమరావతి మీద విద్వేషంతో జగన్‌ అండ్‌ కో చేస్తున్న అసత్య ప్రచారాలు దుర్మార్గమన్నారు. జగన్‌ పార్టీని ప్రజలు 11సీట్లకే పరిమితం చేసినా ఆ పార్టీ నాయకులు మార్పు రాలేదన్నారు. జగన్‌ బ్యాచ్‌ చేస్తున్న ఇలాంటి దిగజారుడు చర్యలను ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా అమరావతి మహిళలపై చేస్తున్న నీచపు ప్రచారాలపై మహిళా కమిషన్‌, ఎస్సీ కమిషన్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 07 , 2025 | 11:39 PM