ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ABN, Publish Date - May 12 , 2025 | 11:48 PM
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.
మొదటి రోజు 241 మంది విద్యార్థుల గైర్హాజరు
కర్నూలు ఎడ్యుకేషన్, మే 12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 21,393 మంది అడ్డాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు నమోదు చేసుకున్నారు. దీంతో 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు ప్రథమ సంవత్సరం, 2:30 నుంచి రూ.5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు మొదటి రోజున 3,842 మంది విద్యార్థులకు గానూ 3,660 మంది పరీక్షకు హాజరు కాగా, 182 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు 660 మంది విద్యార్థులకు గానూ 601 మంది హాజరు కాగా, 59 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసు నమోదు కాలేదు. పరీక్ష కేంద్రాలను కన్వీనర్, ఆర్‌ఐవో ఎస్‌వీఎస్ గురువయ్య శెట్టి, డీవీఈవో సురేష్‌బాబు, జిల్లా డీఈసీ సభ్యులు జి.లాలెప్ప, సురేష్ చంద్ర, పద్మావతితో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు పర్యవేక్షించారు. మొదటి రోజు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులతో ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులను గేటు బయటనే చెకింగ్ చేసి లోపలికి అనుమతించారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
Updated Date - May 12 , 2025 | 11:48 PM