ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖరీఫ్‌ పంటలకు బీమా

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:24 AM

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో ఆరున్నర లక్షల ఎకరాల్లో పత్తి, వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు.

ఉత్తర్వులు జారీ

రైతులంతా వినియోగించుకోవాలని జేడీ విజ్ఞప్తి

కర్నూలు అగ్రికల్చర్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో ఆరున్నర లక్షల ఎకరాల్లో పత్తి, వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు అకాల వర్షాలు, తెగుళ్లు, క్రిమికీటకాలు పంటలను కబళిస్తున్నాయి. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి రైతులు సాగు చేసిన ఈ పంటలు చేతికందే సమయంలో పంటలన్నీ వర్షాభావం వల్లనో, భారీ వర్షాలు, తెగులు, క్రిమికీటకాల వల్లనో మట్టిలో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులకు బీమా కంపెనీల నుంచి నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్నూలు జిల్లాలో 11 పంటలు, నంద్యాల జిల్లాలో 12 పంటలకు బీమాను వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పత్తి, వేరుశనగకు మండల యూనిట్‌గా బీమా పథకాన్ని వర్తింపజేయనున్నారు. పత్తికి ఒక హెక్టారుకు రూ.లక్ష బీమాను వర్తింపజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా పోను రైతులు ఒక హెక్టారుకు రూ.5వేలు చెల్లించాలి. వేరుశనగకు రూ.70వేల బీమాను నిర్ణయించారు. ఒక హెక్టారుకు రూ.1,400 రైతులు ప్రీమియంగా చెల్లించాలి. అదే విధంగా వరికి రూ.1లక్ష బీమా మొత్తాన్ని ఒక హెక్టారుకు నిర్ణయించి రూ.200 ప్రీమియంగా నిర్ణయించారు. అదే విధంగా మొక్కజొన్నకు రూ.32,500 బీమా మొత్తం కాగా, హెక్టారుకు రూ.155 రైతులు కట్టాల్సిన ప్రీమియాన్ని నిర్ణయించారు. కందికి బీమా మొత్తం రూ.55వేలుగా నిర్ణయించి రైతులు ప్రీమియంగా రూ.110 చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఎండుమిర్చి ఒక హెక్టారుకు రూ.2.25 లక్షల మొత్తాన్ని బీమా మొత్తంగా నిర్ణయించి ఒక హెక్టారుకు రూ.900 చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొంది. . జొన్న రూ.47,500 కు గాను రూ.95, ఆముదం రూ.45వేల బీమా మొత్తానికి రూ.90 ప్రీమియంగా చెల్లించాలి.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఈ ఖరీఫ్‌లో పంటలు సాగు చేసిన రైతులందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వాతావరణ బీమా, ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు ఏటా రెండు సీజన్లలో పంటలు కోల్పోయి నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని నివారించేందుకే ప్రభుత్వం బీమా పథకాలను అమలు చేస్తుంది. రైతులందరూ ఈ ప్రీమియం చెల్లించి బీమా పథకం ద్వారా లబ్ధి పొందాలి.

- వరలక్ష్మి, జేడీ

Updated Date - Jun 30 , 2025 | 12:24 AM