ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా జైలు తనిఖీ

ABN, Publish Date - Jun 07 , 2025 | 12:09 AM

కర్నూలు మండలం పంచలింగాలలోని జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి శుక్రవారం తనిఖీ చేశారు.

ఖైదీలకు అందించే ఆహారాన్ని రుచి చూస్తున్న న్యాయాధికారి

కర్నూలు లీగల్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మండలం పంచలింగాలలోని జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి శుక్రవారం తనిఖీ చేశారు. ఆ తర్వాత ఆయన మహిళా జైలును కూడా తనిఖీ చేసి జైలు లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను తనిఖీ చేసి దాని అవశ్యకతను ఖైదీలకు వివరించారు. అనంతరం ఖైదీలకు అందిస్తున్న భోజన వసతి సౌకర్యాల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శివరామచంద్రరావు, జిల్లా జైలు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. అనంతరం ఆయన కర్నూలు ప్రభుత్వ జువైనల్‌ హోంను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జువైనల్‌ మెజిస్ర్టేట్‌ అర్చన, సభ్యులు సునీత, మాధవి, సూపరింటెండెంట్‌ హుశేన్‌ బాషా, ప్యానెల్‌ న్యాయవాది లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 12:09 AM