పాక్‌కు గుణపాఠం చెప్పిన భారత్
ABN, Publish Date - May 18 , 2025 | 12:54 AM
మనదేశంపై ఉగ్రమూకలను ఉసిగొల్పిన పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం గట్టి గుణపాఠం చెప్పిందని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
సైనికులకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
కొలిమిగుండ్ల, మే 17 (ఆంధ్రజ్యోతి): మనదేశంపై ఉగ్రమూకలను ఉసిగొల్పిన పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం గట్టి గుణపాఠం చెప్పిందని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైన నేపథ్యంలో భారత సైనికులకు సంఘీభావంగా శనివారం కొలిమిగుండ్లలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. మొదట హైస్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. జడ్పీహెచ్‌ఎస్ నుంచి పోలీస్‌స్టేషన్, బ్యాంకు మీదుగా, ఆర్‌టీసీ బస్టాండు వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి బీసీ మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. ఇండియా జోలికొస్తే ఏం జరుగుతుందో పాకిస్థాన్‌కు మన సైనికులు రుచి చూపించారని అన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’లో మురళీనాయక్ వీరమరణం పొందడం బాధాకమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మూలే రామేశ్వరరెడ్డి, వీఆర్ లక్ష్మీరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, అంబటి జయలక్ష్మీరెడ్డి, గొంగటి హుస్సేన్‌రెడ్డి, ప్రసాదు, నరసింహుడు, కామిని క్రిష్ణరంగారెడ్డి, కత్తి రాందాస్, శివరామిరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2025 | 12:54 AM