ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహాప్రస్థాన, లెనిన క్లాత సేవలు మెరుగుపరచండి

ABN, Publish Date - Jul 23 , 2025 | 12:23 AM

రోగులకు అందించే మహాప్రస్థాన, స్వచ్ఛ సప్తవర్ల దుప్పట్లు (లెనిన క్లాత) సేవలను ఇంకా మెరుగుపరచాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు.

ఏజెన్సీ నిర్వాహకులతో సమీక్ష నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌

జీజీహెచ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు

కర్నూలు హాస్పిటల్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): రోగులకు అందించే మహాప్రస్థాన, స్వచ్ఛ సప్తవర్ల దుప్పట్లు (లెనిన క్లాత) సేవలను ఇంకా మెరుగుపరచాలని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ చాంబరులో ఆయన సమీక్ష నిర్వహిం చారు. మహాప్ర స్థానానికి సంబంధించిన డెత రిజిస్టర్‌ను సూపరింటెం డెంట్‌ పరిశీలించారు. ఆసుపత్రిలో చనిపోయిన వారిని ఏవిధంగా తరలిస్తున్నారని, రాత్రి పూట వాహనాలు వెళ్లడం లేదని తనకు ఫోన్లు వస్తున్నాయని, ఇక మీదట ఫిర్యాదులు వస్తే సహించేది లేదని సూప రింటెండెంట్‌ హెచ్చరించారు. రాత్రి పూట రెండు వాహనాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, డ్యూటీలో ఉన్న డ్రైవర్లు ఎవరైనా స్పందించక పోతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రిలోని పలు విభాగాల్లో రోగులకు స్వచ్ఛ సప్తవర్ష దుప్పట్లు సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలలో ప్రతి కలర్‌ గల దుప్పట్లు అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలని, పలు విభాగాల్లో ఏడు రోజులు కలర్ల దుప్పట్లను ప్రతి రోజు మార్పు చేయాలని ఆదేశించారు. సమీక్షలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరాములు, హాస్పిటల్‌ ఇనచార్జి సీఎస్‌ఆర్‌ఎంవో టీసీహెచ డా.వెంకటరమణ, డిప్యూటీ సీఎస్‌ ఆర్‌ఎంవో డా.పద్మజ, అడ్మినిస్ర్టేటర్‌ సింధు సుబ్రహ్మణ్యం, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌పీ సావిత్రిబాయి, మహాప్రస్థానం మేనేజర్‌ హఫీజ్‌, సూపర్‌వైజర్‌ ప్రసాద్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 12:23 AM