ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎంఎస్‌ఎంఈ పార్క్‌ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించండి : కలెక్టర్‌

ABN, Publish Date - May 07 , 2025 | 12:14 AM

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎ్‌సఎంఈ పార్క్‌ల ఏర్పాట్లకు స్థలాలు గుర్తించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, మే 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎ్‌సఎంఈ పార్క్‌ల ఏర్పాట్లకు స్థలాలు గుర్తించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ ఎనర్జీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ భూములు, స్థల సేకరణపై కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ పాణ్యం, సుగాలిమెట్ట ప్రాంతాల్లో 50ఎకరాల వరకు ప్రభు త్వ భూమి అందుబాటులో ఉందని, సంబంధిత ప్రాంతాల్లో ఎంఎ్‌సఎంఈ పార్క్‌ ఏర్పాటుపై ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌తో కలిసి పరిశీలించాలని నంద్యాల, డోన్‌, ఆర్డీఓలను ఆదేశించారు. ఆత్మకూరు మండలంలో కూడా ప్రభుత్వ భూము లు 2.5 ఎకరాల మేర ఉంటే పరిశీలించాలన్నారు. రిలయన్స్‌ కంప్రెస్‌డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఐదు వేల ఎకరాలను గుర్తించి నివేదికలు ఇవ్వగా అందులో 765 ఎకరాల్లో ఏర్పాటుచేయడా నికి రిలయన్స్‌ సంస్థ నుంచి అంగీకారం వచ్చిం దన్నారు. గడివేములలో 300 ఎకరాలు, చాగలమర్రిలో 105, రుద్రవరంలో 190, ఆళ్లగడ్డలో 170 ఎకరాలు ఉన్నాయని సదరు భూముల్లో ఎలాంటి ఆక్రమణలు ఉన్నా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను ఆదేశించారు. జేసీ విష్ణుచరణ్‌, డీఆర్వో రామునాయక్‌, ఆర్డీఓలు చల్లా విశ్వనాథ్‌, నాగజ్యోతి, నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 12:14 AM