నేను రాను బాబోయ్!
ABN, Publish Date - Jun 11 , 2025 | 12:00 AM
ఆలూరు నియోజకవర్గంలోని అధికార పార్టీలో మూడు నాలుగు గ్రూపులు ఉండటంతో ఇక్కడ పనిచేసేందుకు తహసీల్దార్లు ముందుగా రావడం లేదు. ఏ పని చేస్తే ఎవరితో తలనొప్పి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఆలూరు తహసీల్దార్‌గా వచ్చేందుకు ఇష్టపడని అధికారులు
అధికార పార్టీలో వర్గ విబేధాలే కారణం
ఐదు మండలాలకు ఇన్‌చార్జి తహసీల్దార్‌లే దిక్కు
ఆలూరు నియోజకవర్గంలోని అధికార పార్టీలో మూడు నాలుగు గ్రూపులు ఉండటంతో ఇక్కడ పనిచేసేందుకు తహసీల్దార్లు ముందుగా రావడం లేదు. ఏ పని చేస్తే ఎవరితో తలనొప్పి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆలూరు ఇన్‌చార్జి తహసీల్దార్‌గా డీటీకి బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆయన సెలవులో వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇన్‌చార్జిలతో తమ పనులు కాక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఆలూరు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ నాయకుల తీరుతో నియోజకవర్గంలో పనిచేసేందుకు తహసీల్దార్లు ముందుకు రావడం లేదు. దీంతో అయిదు మండలా లకు రెగ్యులర్ తహసీల్దార్ లేరు. అధికార పార్టీ నాయకుల విబేధాలతో తమకెందుకు తలనొప్పి అని పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. బలవంతంగా పోస్టింగ్ ఇచ్చినా సెలవులో వెళ్లిపోతున్నారు.
ఇబ్బంది పడుతున్న ప్రజలు
ఇన్‌చార్జిల పాలనలో సమస్యలు పరిష్కా రం కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అధికారులు కూడా ఎవరిమాట వింటే ఏమవుతుందోనన్న భయంతో పనులు చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో వర్గపోరు ఉం డటంతో ఎవరిమాట వింటో ఏమవుతుందోన్న భయంతో ఉన్నట్లు ఓసీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఇలాగే కొనసాగితే నియోజవర్గంలో రెవెన్యూ శాఖ అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు సమన్వయం చేసు కుని సమస్యను పరిష్కరించుకోవలసి ఉంది.
అయిదు మండలాలకు ఇన్‌చార్జిలే దిక్కు..
ఇటీవల నిర్వహించిన బదీల్లో 5 మండలాలకు రెగ్యులర్ తహసీల్దార్లను నియమించలేదు. ఇక్కడ అధికార పార్టీ నాయకుల్లో విబేధాలు ఉండటంతో ఇక్కడ పనిచేసేందుకు తహసీల్దార్లు ఆసక్తి చూపడం లేదు. దేవనకొండ మండలానికి మాత్రమే రెగ్యులర్ తహసీ ల్దార్‌గా రామాంజనేయులును నియ మిం చారు. ఆలూరు తహసీల్దార్ గోవింద్ సింగ్‌ను అధికారులు బదిలీ చేసి, డీటీ విజయ్‌కుమార్‌కు ఇన్‌చార్జిగా బాధ్యతలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే బాధ్యతలు తీసుకోడానికి డీటీ నిరాకరించినట్లు సమాచారం. ఒకవేళ బలవంతంగా బాధ్యతలు అప్పగించినా దీర్ఘకాలిక సెలవులో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు హాలహర్వి మండల డీటీ లక్ష్మికి ఇన్‌చార్జి తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగిం చారు. చిప్పగిరి మండలానికి కూడా డిప్యూటీ తహసీల్దార్ ఎజాజ్ అహ్మద్‌ను ఇన్‌చార్జి తహసీ ల్దార్‌గా కొనసా గిస్తున్నారు. ఆస్పరిలో డీటీ రమేష్ రెడ్డిని ఇన్‌చార్జి తహసీల్దార్‌గా కొనసాగిస్తున్నారు. ఇక హొళగుంద తహసీల్దార్ సతీష్ నాలుగు నెలల క్రితం బదిలీపై వెళ్లగా డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ ఇన్‌చార్జి తహసీల్దార్‌గా కొనసాగించ డాన్ని చూస్తే ఇక్కడ వర్గ పోరు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
Updated Date - Jun 11 , 2025 | 12:00 AM