గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి: పీడీ
ABN, Publish Date - May 16 , 2025 | 12:55 AM
గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ టి.చిరంజీవి లబ్ధిదారులకు సూచించారు.
లబ్ధిదారులతో మాట్లాడుతున్న హౌసింగ్ పీడీ చిరంజీవి
కల్లూరు, మే 15(ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ టి.చిరంజీవి లబ్ధిదారులకు సూచించారు. గురువారం కల్లూరు మండలం పెద్దటే కూరు, బస్తిపాడు గ్రామాల్లోని లేఅవుట్లను సందర్శించి లబ్దిదారులతో మాట్లాడారు. ఈసందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ, బీసీలకు ప్రస్తుతం అందించే రూ.1.8 లక్షలకు అదనంగా బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, మగ్గం వారికి రూ.50వేలు, చెంచు లకు రూ.లక్ష మంజూరు చేసిందన్నారు. హౌసింగ్ ఈఈ వెంకటదా సు, డీఈఈ ప్రభాకర్, కల్లూరు హౌసింగ్ ఏఈ శ్రీనాఽథ్ పాల్గొన్నారు.
Updated Date - May 16 , 2025 | 12:55 AM