హోంగార్డ్స్ సంక్షేమానికి ప్రాధాన్యం
ABN, Publish Date - May 14 , 2025 | 11:33 PM
హోంగార్డ్స్ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని హోంగార్స్డ్ కమాం డెంట్ మహేశ్‌కుమార్ అన్నారు.
విధుల్లో ప్రతిభ కనబర్చాలి
పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలి
హోంగార్డ్స్ కమాండెంట్ మహేశ్‌కుమార్
నంద్యాల టౌన్, మే 14 (ఆంధ్రజ్యోతి): హోంగార్డ్స్ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని హోంగార్స్డ్ కమాం డెంట్ మహేశ్‌కుమార్ అన్నారు. బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయం మైదానంలో కవాతు నిర్వహించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారికి దర్బార్ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్ట ల్ డిపార్టుమెంట్‌లో ప్రతిఒక్కరికి ప్రమాద బీమా సుమారుగా రూ.3.95 లక్షలు అందజేస్తున్నట్లు గుర్తు చేశారు. ఎవరూ కూడా దురాలవాట్లకు లోనుకాకుండా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ద్వారా వచ్చే పాలసీలు రెన్యూవల్ చేసుకోవాలన్నారు. పోలీసు వారితో సమానంగా సేవలు నిర్వహించాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, రిజర్వు ఇన్‌స్పెక్టర్ మంజునాథ్, సురేశ్‌బాబు, ఆర్‌ఎస్పై ఉమా మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 14 , 2025 | 11:33 PM