లాడ్జీల ధరలకు రెక్కలు
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:19 AM
మంత్రాల యంలో ప్రైవేటు లాడ్జీల ధరలకు రెక్కలు వస్తున్నాయి. రాఘవేంద్రస్వామి దర్శనార్థం వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ప్రైవేటు లాడ్జీల యజమా నులు నిలువుదోపిడీకి గురిచేస్తున్నారు. రూ.300లు గల అద్దె ఉన్న గదిని ఏకంగా రూ.15వేలు పెంచి భక్తుల నుంచి ముక్కు పిండి వసూలు చేశారు.
భక్తుల నుంచి నిలువు దోపిడీ
రూ.300 రూం రూ.15వేలు
భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని డిమాండ్
మంత్రాలయం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): మంత్రాల యంలో ప్రైవేటు లాడ్జీల ధరలకు రెక్కలు వస్తున్నాయి. రాఘవేంద్రస్వామి దర్శనార్థం వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ప్రైవేటు లాడ్జీల యజమా నులు నిలువుదోపిడీకి గురిచేస్తున్నారు. రూ.300లు గల అద్దె ఉన్న గదిని ఏకంగా రూ.15వేలు పెంచి భక్తుల నుంచి ముక్కు పిండి వసూలు చేశారు. బక్రీద్, ఆదివారం వరుస సెలవు దినాలు రావడంతో శుక్రవారం నుంచి శనివారం రాత్రి వరకు భక్తుల రద్దీని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు లాడ్జీల యజమా నులు అమాంతంగా గదులకు రేట్లను పెంచేశారు. గంటకు ఓ రేటు పెట్టి భక్తులను దోచుకుం టున్నారు. ఇంత పెద్ద మొత్తం లో చెల్లించలేని సాధారణ పేద, మధ్యతరగతి భక్తులు పిల్లాపా పలతో, తల్లిదండ్రులు, వృద్దులతో మధ్వమార్గ్ కారిడార్‌లోనే బస చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇళ్లను సైతం లాడ్జీలుగా మార్చేసి..
కొంత మంది ఇళ్లను సైతం లాడ్జీలుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్న ఇంట్లోనే స్నానానికి రూ.250 నుంచి రూ.300 ప్రకారం ఇవ్వడంతో మంత్రాలయంలోని పలు ఇళ్లు మూడు పూవులు, ఆరు కాయలుగా భక్తులను ఆహ్వానించి డబ్బు సంపాదిస్తున్నారు. అందనంత రేట్లు పెట్టడంతో పిల్లాపాపలతో టభక్తులు ఇబ్బందులు పడ్డారు. మంత్రాలయంలో దాదాపు 10వేల నుంచి 15వేల దాకా వసతి కల్పిం చేందుకు అనుకూలంగా ఉంది. 60వేల నుంచి 80వేల మంది పైగా భక్తులు తరలివచ్చారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు లాడ్జీల యజమా నులు రేట్లను అమాంతంగా పెంచేసి కృత్రిమ కొరత సృష్టించారు. ప్రైవేటు లాడ్జీల యజమానులు మిలాఖత్ అయ్యారు. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి మఠానికి చెందిన దాదాపు 1500 రూములు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా బుక్ చేసుకుని నిండిపోవడంతో కర్ణాటక గెస్టుహౌస్, అబోడే హోటల్, శ్రీనికేతన్ నిండిపోవడంతో ప్రైవేటు లాడ్జీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాడ్జీల్లో 3 గంటలకు ఒక రేటు పెట్టి, ఆ స్నానానికి, కాలకృత్యాలకు ఓ రేటు పెట్టి నిమిషం దాటినా రూ.వేలలో వసూలు చేయడం దారుణంగా మారింది. అధికారులు పట్టించుకోకపోవడం తోనే ప్రైవేటు లాడ్జీల యజమానులు భక్తులను దోచేసుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, కుడా అధికారులు చర్యలు తీసుకుని లాడ్జీల ధరలకు కల్లెం వేసేందుకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Updated Date - Jun 08 , 2025 | 12:19 AM